నిర్మాత సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం.. అమ్మకానికి ఐకానిక్ థియేటర్
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతొంది. ఒక ఐకానిక్ థియేటర్ ను పూర్తిగా భారీ ధరకు అమ్మేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా మార్కెట్ చాలా వరకు తగ్గిపోతొంది అనే కామెంట్స్ అయితే ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఎంతో బాగుంటే గాని జనాలు థియేటర్స్ కు రావడం లేదు. అంతే కాకుండా ఓటీటీ కూడా థియేటర్లపై కొంత ప్రభావం చూపుతోంది అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
అయితే ఈ క్రమంలో థియేటర్స్ బిజినెస్ కూడా చాలా కష్టంగా మారిపోయింది అనేవారు ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో సురేష్ బాబు కొన్ని థియేటర్లను సొంతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ థియేటర్ ను అమ్మేసినట్లు టాక్. విశాఖపట్నంలో ఎంతోకాలంగా ఐకానిక్ థియేటర్ గా కొనసాగుతున్న జ్యోతి థియేటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన విచిత్ర బంధం 1972లో విడుదల కాదా ఆ సినిమాతోనే ఈ థియేటర్లో ప్రస్థానం మొదలైంది.

ఇక తర్వాత విచిత్రబంధం అక్కడే 100 రోజులు ఆడింది. అనంతరం తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా నిన్నే పెళ్ళాడుతా 189 రోజులు ఆడిన చరిత్ర ఉంది. అయితే అలాంటి థియేటర్లు ఇప్పుడు నష్టాల బారిన పడటంతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కం కాంప్లెక్స్ గా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం వ్యాపారులందరికీ కూడా సురేష్ బాబు దీన్ని విక్రయించినట్లు టాక్. పది అంతస్తులో 80 అపార్ట్మెంట్స్ ఆఫీస్ స్పెన్ లు ఉండే విధంగా అపార్ట్మెంట్ ను నిర్మించబోతున్నట్లు సమాచారం. ఒక విధంగా ఆయన థియేటర్ బిజినెస్ వ్యాపారంలో లాభదాయకంగా లేదని ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఉంటారు అని తెలుస్తోంది. అలాంటి పెద్ద నిర్మాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రస్తుతం సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











