నా పెళ్లికి కారణం ఎన్టీఆర్​.. మేకప్​ కూడా తీయకుండా వచ్చి.. నిర్మాత స్వప్న దత్​ ఆసక్తికర కామెంట్స్​

సెన్సేషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్​ సల్మాన్​, బాలీవుడ్​ భామ మృణాల్​ ఠాకూర్​ నటించిన అద్ధుతమైన ప్రేమ కావ్యం సీతా రామం. నేషనల్​ క్రష్​ రష్మిక మందన్నా మరో కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న విడుదలైంది. తొలి రోజు నుంచే విజయపథంలో దూసుకుపోతున్న ఈ మూవీ వైజయంతీ మూవీస్​ సమర్పణలో అగ్ర నిర్మాత అశ్వనీదత్​ నిర్మించారు. ఆయనకు నందమూరి కుటుంబానికి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అయితే అశ్వనీ దత్​ రెండో కుమార్తె, ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్​గా రాణిస్తున్న స్వప్న దత్ పెళ్లి విషయంలో యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ కీలక పాత్ర పోషించాడని టాక్​. మరి అదెంటో చూద్దామా!

టాలీవుడ్​ స్టార్​ ప్రొడ్యూసర్​లలో అశ్వినీ దత్​ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న ప్రాజెక్ట్​ కె చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్​గా చేస్తున్న ఈ మూవీకి నాగ్​ అశ్విన్​ దర్శకత్వం వహిస్తున్నారు.

నందమూరి ఫ్యామిలీతో..

నందమూరి ఫ్యామిలీతో..

ఇందులో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్ర నిర్మాత అయిన అశ్వనీదత్​కు నందమూరి కుటుంబానిక చక్కని అనుబంధం ఉందని చెప్పుకుంటారు.

 బ్యానర్​లో ఎన్టీఆర్​ ఫొటో..

బ్యానర్​లో ఎన్టీఆర్​ ఫొటో..

అశ్వనీ దత్​ వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో సీనియర్​ ఎన్టీఆర్​ ఫొటో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్​తో సైతం స్టూడెంట్ నెంబర్​ 1, కంత్రి, శక్తి వంటి చిత్రాలను నిర్మించారు అశ్వనీ దత్​.

చాలా క్లోజ్​..

చాలా క్లోజ్​..

సినిమాల సంగతి పక్కన పెడితే రియల్​ లైఫ్​లో అశ్వనీ దత్ కుటుంబానికి తారక్​ చాలా సాన్నిహిత్యంగా ఉంటాడట. అయితే అశ్వనీ దత్​ రెండో కుమార్తె స్వప్న దత్​ పెళ్లికి ఎన్టీఆర్​ సహాయం చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా స్పప్న దత్​ తెలిపింది.

 గ్యాప్​ తీసుకుందామనుకున్నా..

గ్యాప్​ తీసుకుందామనుకున్నా..

'మీ పెళ్లి జరగడంలో ఎన్టీఆర్​ పాత్ర ఉందట కదా' అని యాంకర్​ అడిగిన ప్రశ్నకు ''అవును. నా ప్రేమ వర్కౌట్​ అవదులే. కొంచెం గ్యాప్​ తీసుకుందాం అని నేను అనుకుంటున్న సమయంలో తారక్​ వచ్చి నాన్న గారితో మాట్లాడి ఒప్పించాడు.

మేకప్​ తీయకుండా వచ్చి మరీ..

మేకప్​ తీయకుండా వచ్చి మరీ..

'ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదు నేను వచ్చి మాట్లాడతాను' అని సినిమా షూటింగ్ మధ్యలోనే మేకప్​ కూడా తీయకుండా వచ్చి మా నాన్నతో మాట్లాడాడు. నా జీవితంలో ఎన్టీఆర్​ చాలా ఇంపార్టెంట్ రోల్​ ప్లే చేశాడు.

 2010లో వివాహం..

2010లో వివాహం..

తనను కానీ, తను సహాయాన్ని కానీ అస్సలు మర్చిపోలేను. మా బ్యానర్​లో ఎన్టీఆర్​ సినిమా చేసిన, చేయకున్నా నాతో క్లోజ్​గా ఉంటాడు' అని తెలిపింది. కాగా ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని స్వప్న దత్ ప్రేమించి 2010 డిసెంబర్​ 19న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నవ్య జయంతి అనే కుమార్తె కూడా ఉంది. ​

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X