డర్టీ పాలిటిక్స్: కేసీఆర్, చిరంజీవి పేరు లాగడంపై ప్రముఖ నిర్మాత అసంతృప్తి!

ఠాగూర్ మధు... తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాత. చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీ 'ఠాగూర్' తీసిన ఆయన అదే పేరుతో ఫేమస్ అయ్యారు. తెలుగులో ఎన్నో చిత్రాలు నిర్మించడంతో పాటు పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు.

మహేష్ బాబుతో స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమా తీసి నష్టాలపాలైన ఆయన అనేక తమిళ అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. ఏపీలో ఎన్నికల సమరం జరుగుతున్న వేళ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఠాగూర్ మధుకు కోపం తెప్పించాయి. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్, చిరంజీవి పేరు లాగడంపై ఆగ్రహం

కేసీఆర్, చిరంజీవి పేరు లాగడంపై ఆగ్రహం

మీ రాజకీయాలు మీరు చేసుకోండి. క్రమశిక్షణ కు మారుపేరైన మెగాస్టార్ ను ఎందుకు లాగుతారు. మౌనంగా ఉన్న కేసీఆర్ ఊసేందుకు. భావవ్యక్తీకరణ మాత్రమే కాదు భాష కూడా ముఖ్యం అని మర్చిపోకండి... అంటూ ఠాగూర్ మధు ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ...

సోషల్ మీడియాలో చిరంజీవిని టార్గెట్ చేస్తూ...

జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న చాలా మంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా లాగి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఠాగూర్ మధును నొప్పించాయి.

కేసీఆర్ గురించి కూడా...

కేసీఆర్ గురించి కూడా...

అయితే కేసీఆర్ గురించి కూడా ఠాగూర్ మధు తన ట్వీట్లో ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. ‘మౌనంగా ఉన్న కేసీఆర్ ఊసేందుకు' అంటూ ఆయన తన ట్వీట్ ద్వారా హితవు పలికే ప్రయత్నం చేశారు. చిరంజీవి గురించి అంటే...టీడీపీ, వైసీపీ మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు అనుకోవచ్చు? మరి ‘కేసీఆర్' విషయం తీయడం ద్వారా ఠాగూర్ మధు ఎవరిని టార్గెట్ చేశారనేది హాట్ టాపిక్ అయింది.

కేసీఆర్ మీద పరోక్షంగా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్

కేసీఆర్ మీద పరోక్షంగా విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రసంగాల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రస్తావన తెస్తూ... తెలంగాణలో ఆంధ్రావారిని తిరిమి తరిమి కొడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పరోక్షంగా కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఠాగూర్ మధు అలా రియాక్ట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ ప్రసంగాలే కారణమా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X