'నాన్నకు ప్రేమతో...' గురించి నిర్మాత ఇలా
హైదరాబాద్: ఎన్టీఆర్‌కు 25వ సినిమా 'నాన్నకు ప్రేమతో..'. సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ఇటీవల లండన్‌లో భారీ షెడ్యూల్ జరిపామనీ, తదుపరి షెడ్యూల్‌ను అక్టోబర్ 20న మొదలుపెడతామని బీవీయస్‌యన్ ప్రసాద్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందనీ, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో ఈ పాత్రలో ఒదిగిపోయారని ఆయన తెలిపారు.
ఇప్పటివరకూ ఆయన నటించిన 24 చిత్రాల్లోని లుక్స్‌కి పూర్తి భిన్నంగా, చాలా స్టయిలిష్‌గా ఎన్టీఆర్ కనిపించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను వినాయిక చవితి సందర్బంగా ఎన్టీఆర్ తన సోషల్ నెట్ వర్కింగ్ ఖాతా ద్వారా విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిత్రం విశేషాలకు వస్తే....
'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. ఆ తరవాత 'అదుర్స్'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు.
అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











