ఫ్లాపుకి కారణం వానలని తేల్చేసారు
''సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ ఘనంగా లేకపోవడానికి కారణం వర్షాలు పడుతూ వాతావరణం సహకరించకపోవడమే. త్వరలోనే కలెక్షన్లు పుంజుకుంటాయని ఆశిస్తున్నాం"" అని 'దగ్గరగా... దూరంగా..!" చిత్రం నిర్మాత సాంబశివరావు చెప్పారు. సుమంత్, వేదిక కాంబినేషన్ లో చావలి రవికుమార్ దర్శకత్వంలో జె.సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోందని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి మాట్లాడుతూ - థియేటర్‌లో ప్రేక్షకుల సమక్షంలో ఈ సినిమా చూశాం. అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేమకథలో ఇదొక వినూత్న ప్రయత్నం అంటున్నారు. నా స్టైల్‌లో సామాజిక సమస్యలను సృ్పశిస్తూనే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. నటుడిగా సుమంత్‌ని మరోమెట్టు పైకి తీసుకెళ్లిందీ సినిమా. అలాగే... వేదిక అందం, అభినయం రెండూ ప్రేక్షకులకు నచ్చాయి. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అన్నారు.ఉగ్రవాద నేపథ్యంలో సాగిన ప్రేమకథ 'దగ్గరగా... దూరంగా..!".


Click it and Unblock the Notifications











