CBN Arrest చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి భారీ మైలేజ్.. తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం సంచలనం రేపింది. తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ సంఘటనపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెప్ట్‌పై సినీ వర్గాలు తమకు తోచిన విధంగా కామెంట్లు చేశారు. సంచలన విషయంగా మారిన చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ..

చంద్రబాబు నాయుడు అరెస్ట్ నాటకీయ ఫక్కీలో జరిగింది. మన దేశంలో వీఐపీలు, పొలిటికల్ లీడర్స్, ప్రముఖుడిని, పెద్ద నాయకుడిని అరెస్ట్ జరిగినప్పుడు నాటకీయత ఎక్కువగా ఉంటుంది. అయితే అరెస్ట్ కరెక్ట్ కాదా? అవునా? అనేది ఎవరూ సరిగా చెప్పలేం. ఎందుకంటే రెండు గ్రూపులు రెండు రకాలుగా తమ వాదనలు వినిపిస్తాయి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణానిధి అరెస్ట్ చేశారు. అరెస్టుల వల్ల కొంప మునిగేది ఏమీ ఉండదు. ఆరోపణలు రుజువు అయితే ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అని తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు.

Producer Tammareddy Bharadwaj reaction on Chandrababu Naidu Arrest

చంద్రబాబు నాయుడు లాంటి లీడర్‌ను అరెస్ట్ చేసినప్పుడు ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆరోపణలు ఫేస్ చేసి తిరిగి రావాలి. చంద్రబాబే కాదు.. అవినాష్ రెడ్డి అరెస్ట్‌ను ఎందుకు ఆపాలని చూడటం సరికాదు. ఇవన్నీ అర్ధం కాని విషయాలు. చంద్రబాబు అరెస్ట్ వల్ల కేవలం వైఎస్ఆర్సీపీ నేతల కళ్లలో ఆనందం మాత్రమే కనిపిస్తున్నది అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

చంద్రబాబు అరెస్ట్ గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలుగుదేశం పార్టీకి మంచే జరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే.. రానున్న ఎలక్షన్స్‌లో చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉన్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీకి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నాను. దాదాపు 5000 కోట్ల ఖర్చు వారికి తగ్గిందని భావిస్తున్నాను అని తమ్మారెడ్డి భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

Producer Tammareddy Bharadwaj reaction on Chandrababu Naidu Arrest

చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజల నుంచి సానుభూతి పెరగడం స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్‌ను టెలివిజన్ ఛానెల్స్ ప్రసారం చేయడంతో తెలుగు ప్రజలందరూ టీవీలకు అతుక్కొని చూశారు. దాని వల్ల న్యూట్రల్‌గా ఉండే ప్రజలకు చంద్రబాబుపై సానుభూతి పెరిగే అవకాశం ఉంది. అలాగే వైసీపీ కొంత సానుకూలత ఉన్నప్పటికీ.. తెలుగు దేశం పార్టీకి మరింత సానుభూతి పెరిగిందని నా అభిప్రాయం అని తమారెడ్డి భరద్వాజ్ చెప్పారు.

భారత రాజకీయాల్లో ఎంతో చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ దురదృష్టకరం అని చెప్పలేను. కానీ సీరియస్ ఇష్యూనే. ఇంతకు ముందు అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయినంత మాత్రాన అవమానంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. జైలుకు వెళ్లి వచ్చిన జగన్ సీఎం అయ్యారు. పాలిటిక్స్‌లో ఇవన్నీ సర్వసాధారణం అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X