పవన్ కల్యాణ్ సినిమా మొదటి రోజు చూస్తే గొప్పని ఫీలయ్యే వాడిని.. టీజీ విశ్వప్రసాద్ ఎమోషనల్

మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో'. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

Producer TG Vishwa Prasads lovely speech about Pawan Kalyan at Bro Pre release event

నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. టైమ్ గురించి ఒక విషయం చెబుతాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పవన్ కల్యాణ్‌ సినిమా మొదటి రోజు చూస్తే అది గొప్పగా భావించే వాడిని. అలాంటిది ఆయనతో బ్రో సినిమా చేయడం నా టైమ్ కలిసి వచ్చింది. ఈ సినిమా మా బ్యానర్‌‌లో 25వ సినిమా కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా చేసినందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం అని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు.

నాదెండ్ల మనోహర్ గారితో పవన్ కల్యాణ్‌తో పరిచయం జరిగింది. ఆయనతో చాలా ట్రావెల్ చేశాను. ఆయన విజన్ నాకు చాలా నచ్చింది. అనుకొన్న టైమ్‌లో ఈ సినిమాను పూర్తి చేశారు. అందుకు చాలా థ్యాంక్స్ అని విశ్వ ప్రసాద్ పేర్కొన్నారు.

Producer TG Vishwa Prasads lovely speech about Pawan Kalyan at Bro Pre release event

నాదెండ్ల మనోహర్ చేసిన పరిచయం నుంచి పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన మొదటి సినిమా నిర్మించే అవకాశం దక్కింది. దీనికి త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తోడయ్యాయి. కళ్యాణ్ గారు ఇచ్చిన టైంలో సముద్రఖని గారు సినిమా పూర్తి చేశారు. దీనినే టైం కలిసిరావడం అంటారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు టైంగా విశ్వరూపం చూపించిన ఈ సినిమా మా బ్యానర్ లో 25వ సినిమా కావడం గొప్ప విషయం" అన్నారు.

సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. బ్రో సినిమా, భగవత్గీతను నర్సరీ రైమ్ అంత సింపుల్ గా చెప్తే ఎంత బాగుంటుందో అంతా బాగా త్రివిక్రమ్ గారు రాశారు. పండితులకు, పామరులకు అర్థమయ్యేలా అంత అద్భుతంగా సముద్రఖని గారు తీశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతిమాట రాసుకోదగ్గది. ఇంతమంచి సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X