లైంగిక వేధింపులు: నిర్మాతను చితకబాదిన వైనం!
సినిమా అవకాశాలు ఆశ చూపి అమ్మాయిలను లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, వేధింపులకు పాల్పడటం లాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తరుపు బంధువులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిర్మాత
హైదరాబాద్: సినిమా అవకాశాలు ఆశ చూపి అమ్మాయిలను లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడం, వేధింపులకు పాల్పడటం లాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తరుపు బంధువులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిర్మాతను చితకబాదారు.
సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను బయటకు చెప్పడానికి అమ్మాయిలను ఇష్టపడరు, ఏదైనా గొడవ జరిగితే సినీ రంగంలో తమకు భవిష్యత్తు లేకుండా పోతుందని భయపడుతుంటారు. ఆ నమ్మకంతోనే సినీరంగంలోని కొందరు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతుంటారు. అయితే బెంగుళూరులో మాత్రం సీన్ రివర్స్ అయింది.

'ప్రీతి మాయ హుషారు' నిర్మాత పనే
'ప్రీతి మాయ హుషారు' అనే సినిమాను నిర్మించిన వీరేష్ కార్యాలయంలో ఓ యువతి పని చేస్తోంది, హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానంటూ ఆమెను వీరేష్ లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. అతడి వేధింపులతో ఆమె పని మానేయడంతో కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

చితకబాదిన బంధువులు
వీరేష్ వేధింపుల విషయం సదరు యువతి చెప్పడంతో బంధువులంతా హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఉన్న వీరేష్ ఇంటికి వచ్చి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించి కేసు పెట్టారు.

ఇండస్ట్రీలో పరిస్థితి గురించి హీరోయిన్లు
నిర్మాతలు, దర్శకులు, హీరోలు.... అవకాశాల పేరుతో హీరోయిన్లను లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నాలు చేయడం లాంటివి జరుగుతున్నాయని, కొందరు ఏదారి లేక లొంగిపోయిన సందర్బాలు కూడా ఉన్నాయని కొందరు హీరోయిన్లు ఇటీవల పలు ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.



Click it and Unblock the Notifications