Vishnu Manoj గొడవలకు కారణం ఆస్తులే.. విష్ణుకు ఇగో.. మనోజ్ అలా.. నిర్మాత కామెంట్స్ వైరల్

కలెక్షన్ కింగ్, నటుడు, హీరో, విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు అన్న విషయం తెలిసిందే. వీరిద్దరు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన శైలీలో ఎంటర్టైన్ చేశారు. అయితే వీరిద్దరు మోహన్ బాబు స్థాయిలో మాత్రం గుర్తింపు, క్రేజ్ సంపాదించుకోలేకపోయారు. ఇక ఇటీవల మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవ అయినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ గొడవపై మోహన్ బాబు, విష్ణు స్పందించారు. అయితే వాళ్లిద్దరి గొడవలకు అసలు కారణం మాత్రం తెలియరాలేదు. తాజాగా ఈ విషయాలన్నింటిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత, నటుడు, మంచు ఫ్యామిలీకి సన్నిహితుడు త్రిపురనేని చిట్టి బాబు.

హాట్ టాపిక్ గా..

హాట్ టాపిక్ గా..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మంచు మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ గొడవ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు తన ఫ్యామిలీ బంధువైన సారథి అనే వ్యక్తిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోలో "మా బంధువుల ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటాడు. ఇది విషయం" అని మనోజ్ చెప్పడం తెలిసిందే. దీంతో ఇద్దరు అన్నదమ్ములకు గొడవలు ఉన్నట్లు తెలిసింది.

 పర్సనల్ వ్యవహారాలు..

పర్సనల్ వ్యవహారాలు..

ఇక ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు దాన్ని మనోజ్ చేత డిలీట్ చేయించారు. అయితే తాజాగా ఈ ఇష్యూపై మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులైన, నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గొడవ జరిగిన ఇల్లు సారథిది. ఆయన మంచు ఫ్యామిలీకి బంధువు. చాలా ఏళ్ల పాటు మోహన్ బాబు పర్సనల్ వ్యవహారాలు చూశాడు. ఆయన బ్యాంక్ అకౌంట్స్, సినిమా షెడ్యూల్స్ చూసేవాడు" అని చిట్టి బాబు తెలిపారు.

ఆ బాధ్యతలు విష్ణుకు..

ఆ బాధ్యతలు విష్ణుకు..

"ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో కూడా సారథి ముందుండి పని చేశాడు. అయితే మొన్నటిదాకా అన్ని విషయాలపై మోహన్ బాబు పర్యవేక్షణ ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలందరికీ ఎవరి ఆస్తులు వారికి పంచేశారు. తన కాలేజీపైనే పూర్తిగా ఫోకస్ పెడుతూ మిగతా బాధ్యతలు ఒక్కొక్కటిగా తప్పించుకుంటున్నాడు. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఇప్పుడు ఆ బాధ్యతలను విష్ణు తీసుకున్నాడు. అన్నీ చెక్ చేసుకుంటుండగా.. ఒక సమస్య తలెత్తింది" అని చిట్టి బాబు పేర్కొన్నారు.

తన అసిస్టెంట్సే ఆపారు..

తన అసిస్టెంట్సే ఆపారు..

సమస్యను పరిష్కరించే క్రమంలోనే గతంలో వ్యవహారాలు చూసిన సారథిని అడిగాడు విష్ణు. అయితే అతను సరిగ్గా స్పందించలేదు. చివరకీ విసుగొచ్చిన విష్ణు డైరెక్ట్ గా సారథి ఇంటికి వెళ్లాడు. నిజానికి వేరొకరు అయితే వెళ్లేవాడు కాదు. సారథి తమ బంధువే కాబట్టి వెళ్లాడు. అక్కడ కూడా సారథి సరిగా సమాధానం చెప్పలేదు. దీంతో విష్ణు అతనిపై చేయి ఎత్తాడు. అప్పుడు విష్ణుని తన అసిస్టెంట్సే ఆపారు అని నిర్మాత చిట్టి బాబు చెప్పుకొచ్చారు.

అన్నయ్య హీరోయిజం చూపించేందుకే..

అన్నయ్య హీరోయిజం చూపించేందుకే..

"ఇలాంటి ఓ సమస్య ఉన్నప్పుడు మోహన్ బాబుకే చెప్తే సరిపోయేది. కానీ తనే పరిష్కారించాలన్న ఒక చిన్న ఇగోతో విష్ణు వెళ్లడం వళ్లే ఇలా జరిగింది. ఇది విష్ణు తప్పు అయితే.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం మనోజ్ తప్పు. ఇదే ఇప్పుడు పెద్ద గొడవ అయింది. చిన్న తప్పును కూడా భరించలేని అన్నయ్య అయిన వాళ్లను కూడా వదిలిపెట్టరు అన్న ఉద్దేశంతో విష్ణు హీరోయిజం చూపించేందుకే మనోజ్ అలా చేశాడు. కానీ అది రివర్స్ అయింది" అని చిట్టి బాబు వివరించారు.

ఈరోజు ఇలా బయటకు..

ఈరోజు ఇలా బయటకు..

ఇదిలా ఉంటే విష్ణు, మనోజ్ కు ఆస్తి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులు, ఆయన బయోగ్రఫీ రాసేందుకు రీసెర్చ్ కూడా చేసిన దాము బాలాజీ చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరి మధ్య ఆస్తి గొడవలు ఎప్పటినుంచో ఉన్నాయి. అవి ఈరోజు ఇలా బయటకు వచ్చాయి. అంతకంటే ఇందులో ఏం లేదు అని దాము బాలాజీ చెప్పినట్లు పలు కథనాలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X