twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరోనాతో మృతి.. ఎన్టీఆర్‌తో అద్భుతంగా.. జాతీయస్థాయిలో అవార్డులు

    |

    కరోనావైరస్ మహమ్మారి ఎంతో మంది సినీ ప్రముఖులను, కళాకారులను పొట్టనపెట్టుకొంటున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా రంగానికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నది. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులు, నటీనటుల మరణంతో విషాదం మునిగి.. ఆ వార్తల నుంచి కోలుకోక ముందే మరో విషాద వార్తను వినాల్సి వచ్చింది.

    తెలుగు చిత్రసీమకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యు విశ్వేశ్వరరావు కరోనాతో కన్నుమూశారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

    Producer U Visweswar Rao dies due to Coronavirus positive

    విశ్వశాంతి విశ్వేశ్వరరావు కొద్ది రోజుల క్రితం కరోనావైరస్‌ బారిన పడ్డారు. ఆయనకు పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స చేయించారు. అయితే కరోనావైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

    చిన్నతనంలో లేటేగా విద్యను అభ్యసించిన విశ్వేశ్వరరావు తొలుత గుడివాడ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ సమంయలో సినీ ప్రముఖులు అట్లూరి పూర్ణచంద్రరావు, పీ రాఘవరావు ఆయనకు శిష్యులు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సినీరంగంలోకి ప్రవేశించారు. ప్రముఖ దర్శకులు పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌గా కన్యాశుల్కం, జయభేరి సినిమాలకు పనిచేశారు. బాల నాగమ్మ చిత్రానికి సంబంధించిన తమిళ హక్కులను కొని నిర్మాతగా మారారు. ఆ తర్వాత విశ్వశాంతి అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. 15 తమిళ, తెలుగు డబ్బింగ్ చిత్రాలను విడుదల చేశారు.

    Producer U Visweswar Rao dies due to Coronavirus positive

    విశ్వశాంతి విశ్వేశ్వరరావు తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. కంచుకోట, నిలువుదోపిడి, దేశోద్దారకులు, మార్పు, తీర్పు, హరిశ్చంద్రుడు, పెత్తందార్లు, నగ్నసత్యం, కీర్తి కాంత కనకం లాంటి చిత్రాలను నిర్మించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతోపాటు అగ్రనటులతో సినిమాలను నిర్మించారు.

    1979లో నగ్నసత్యం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొన్నారు. అలాగే 1980లో హరిశ్చంద్రుడు సినిమాకు కూడా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకొన్నారు. ఇక కీర్తి కాంత కనకం సినిమాకు 1982లో ఉత్త దర్శకుడిగా నంది అవార్డు, పెళ్లిళ్ల చదరంగం సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్‌గా నంది అవార్డును అందుకొన్నారు. అంతేకాకుండా దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ ముంబై నుంచి గౌరవ అవార్డును కూడా సొంతం చేసుకొన్నారు.

    English summary
    Producer U Visweswar Rao dies due to Coronavirus positive. Many celebraties condolenced on his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X