'పంజా' టైటిల్ ఎందుకు పెట్టారు?
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'పంజా'త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం టైటిల్ పై ఇప్పటికే అంతటా ఆసక్తి నెలకొని ఉంది. అయితే పంజా అని ఎందుకు పెట్టారనే అభిమానుల సందేహాలకు నిర్మాతలు సమాధానమిచ్చారు. వారు ఈ టైటిల్ విషయమై వివరణ ఇస్తూ..'పంజా'అనగానే పులి పంజా అనుకుంటారు ఎవరైనా. కానీ ఇందులో పవన్‌కల్యాణ్ పవర్, వ్యవహారశైలి వంటి అంశాలకు సింబాలిక్‌గా పెట్టిన టైటిల్ ఇది. పవన్ లుక్ కూడా గడ్డంతో కొత్తగా ఉంటుంది. కథానుసారంగా చిత్రంలో ఆయన పేరు జయదేవ్. అయితే అందరూ జై అంటుంటారు. మాఫియా నేపథ్య కథాచిత్రమిది. ఇందులో మాఫియా మెంబర్‌గా పవన్‌కల్యాణ్ నటించారు.
అంతమాత్రాన చిత్రం సీరియస్‌నెస్‌గా ఉంటుందని అనుకుంటే పొరపాటే. అందమైన ప్రేమకథ ఉంది. మంచి కామెడీ ఉంది. బ్రహ్మానందం, అలీ తమదైన హాస్యంతో ప్రేక్షకులను ఎంతగానో అలరింపజేస్తారు. ఎక్కడా లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. ఇక యాక్షన్ అనగానే సుమోలు లేచిపోవడం వంటివి కాకుండా చిత్ర కథపరంగా ఎక్కడ ఏది ఎంత అవసరమో అక్కడ అది అంత మోతాదులోనే ఉంటుంది. పవన్‌కల్యాణ్ చిత్రమనగానే ఎన్నో అంచనాలు ఉంటాయి. వాటికి ఎంతమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది' అని చెప్పారు.


Click it and Unblock the Notifications











