twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్‌రాజ్‌పై నిర్మాతల నిషేధం

    By Staff
    |

    స్వతహాగా కన్నడ ప్రాంతానికి చెందినా, తెలుగు, తమిళ చిత్రసీమల్లో విలక్షణ నటుడిగా, విశిష్టమైన వ్యక్తిగా, నటుడిగా, నిర్మాతగా బహుముఖ పాత్రలు పోషిస్తున్న ప్రకాష్‌రాజ్‌పై తెలుగు నిర్మాతల మండలి నిషేధం విధించింది.

    గతంలో ప్రారంభమైన ఒక తెలుగు చిత్రానికి సంబంధించి మూడు రోజుల పాటు ప్రకాష్‌రాజ్‌ డేట్స్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఇప్పుడిక తన డేట్స్‌ లేవని ప్రకాష్‌రాజ్‌ సదరు నిర్మాతకు కరాఖండిగా చెప్పేశారు. దీనితో ఆ నిర్మాత మండలిని ఆశ్రయించగా, దీనిపై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్న పలు చిత్రాలకు ఈ నిషేధం వర్తించదని, ఆయన ఆ చిత్రాలను పూర్తి చేయవచ్చని నిర్మాతల మండలికన్సెషన్‌ ఇచ్చింది.

    ప్రకాష్‌రాజ్‌పై ఇటువంటి ఆరోపణలు రావడం కొత్తేం కాదు. గతంలో కూడా ఆయనకు పవన్‌కల్యాణ్‌ తదితరులతో షూటింగ్‌ సందర్భాలలో గొడవలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొద్ది మంది విరోధులు ఉన్నా, చాలామంది దర్శకులు ప్రకాష్‌రాజ్‌కు వీరాభిమానులు. వారు కథల తయారు సమయంలోనే ప్రకాష్‌రాజ్‌ కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించుకుని, ఆయన బిజీగా ఉన్నా డేట్స్‌ కోసం వేచి ఉంటారు. ఇటీవలే బొమ్మరిల్లు చిత్రంలో హీరో సిద్ధార్థకు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించి తన పాత్రను రక్తికట్టించారని ఎల్లడెలా ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయనపై నిషేధం విధించడం దురదృష్టకరం.

    ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌ నిర్మాతగా ఉదయ్‌కిరణ్‌తో రూపొందిస్తున్న అబద్ధం చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది. తొలుత ఈ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్‌ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నా తరువాత కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రకాష్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గం ఆయనకు అవరోధాలు విధిస్తోందన్న వాదన తెలుగు చిత్రసీమలో ఉంది.

    మరిన్నికథనాలు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X