తెలుగు సినిమా షూటింగ్ లన్నీ గురువారం రద్దు..కారణం
ఈ రోజు హైదరాబాద్ సిటీలో జరుగుతున్న షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. తెలుగు నిర్మాతల మండలి ఆదేశం మేరకే ఈ బ్రేక్ ఇచ్చారు. అందుకు కారణం నిన్న(బుధవారం) చోటు చేసుకున్న సంఘటనలు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఛార్మినార్ వద్ద చిత్రీకరిస్తున్న కందిరీగ సినిమా షూటింగ్ లో చెన్నై, ఆంధ్రా ఫైటర్ల మధ్య బుధవారం ఘర్షణ చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్దంగా స్ధానికేతరులకే సినిమాలో ఎక్కువ ప్రాముఖ్యత కల్పించారని ఆరోపిస్తూ స్ధానికంగా ఉన్న పలువురు సినీ ఫైటర్లు చెన్నై ఫైట్ మాస్టర్లపై దాడి చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం తెలుగు సినిమా షూటింగ్ లన్నీ రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ విషయమై హీరో రామ్ మాట్లాడుతూ..మా కందిరీగ చిత్రం షూటింగ్ ఫైటర్స్ అశోశియేషన్ లోని కొన్ని యూనియన్ సమస్యల వల్ల ఆగిపోయింది. సెట్ మీదకు వచ్చిన ఫైటర్స్ ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. కాని దాదాపు యాభై మంది దాకా వచ్చి మాతో పనిచేస్తున్న ఫైటర్స్ తో గొడవ పడ్డారు. దాంతో మేం తాత్కాలికంగా షూటింగ్ ఆపుచేయాల్సి వచ్చింది అన్నారు. ఇక ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మింస్తున్నారు. ఇక సంతోష్ గతంలో రవితేజతో ఖతర్నాక్, వియన్ ఆదిత్యతో రెయిన్ బో చిత్రాలు చేసారు. రెయిన్ బో చిత్రానికి మంచి కెమెరా వర్క్ అందించారంటూ మంచి ప్రశంసలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











