మాది పక్కా వ్యాపారం:డి.సురేష్ బాబు

By Staff

Suresh Babu
చిన్న చిత్రాల నిర్మాతలు వివాదం రోజు రోజుకీ ముదిరుతోంది. ఈ ఆందోళనలో వారు..అల్లు అరవింద్,దాసరి నారాయణరావు,దిల్ రాజు,సురేష్ బాబు లను మాఫియాలతో పోలస్తూ వారి వల్లే తామ బ్రతకలేమని అంటున్నారు. ఈ నేపధ్యంలో పెద్ద నిర్మాత,డిస్ట్రిబ్యూటర్,ఎగ్జిబిటర్ అయిన డి. సురేష్ బాబు వారి ఆరోపణలకు సమాధానమిస్తున్నారు.

మొదటిగా రాష్ట్రంలోని చాలా థియోటర్స్ మీ అండర్ లో ఉన్నాయని తమ లాంటి చిన్న నిర్మాతలకు థియోటర్స్ దొరకనివ్వటం లేదంటున్నారు అంటే...ఇట్లా వారు స్టేట్ మెంట్స్ ఇవ్వటం చాలా దురదృష్టకరం.ఇది పబ్లిసిటీ స్టంట్ తప్పించి మరొకటి కాదు. రాష్ట్రంలో రెండు వేలకు పైగా ధియోటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఆరోపిస్తున్న మేం నలుగురం కలిపితే ఏడువందల ధియేటర్స్ మాత్రమే లీజుకు తీసుకున్నాం.మిగతా వాటిల్లో వారి సినిమాలు వేసుకోవచ్చు కదా...అయినా వాళ్ళేమన్నా గొప్ప సినిమాలు తీయలేదు.

రెండవ ప్రశ్నగా ధియోటర్ ఎగ్జిభిషన్ ఛార్జెస్ ఎందుకంత పెంచి తీసుకుంటున్నారు...అంటే..రాష్ట్రంలో ధియోటర్స్ కి కొరత ఉంది. అయినా సినిమాలు తీసేవారు ఫలానా ధియోటర్స్ లోనే తమ సినిమాలు రిలీజ్ చేయాలని కోరుకుంటారు. అయితే డిమాండ్ ఎక్కువ..అవకాశం తక్కువ అందుకే రెంట్స్ పెంచాం. అయినా మేం పెంచిన రెంట్స్ మిగతా మెట్రో సిటీ లో ఉన్న ధియోటర్స్ రెంట్స్ తో పోలిస్తే చాలా తక్కువ.

మిమ్మల్ని చిన్న నిర్మాతలు టాలీవుడ్ మాఫియా అంటూ పోలుస్తున్నారు.అంటే సమాధానంగా..రెంటల్ సిస్టమ్ లో రెంట్స్ అన్ని ధియోటర్ ఓనర్స్ కే వెళ్ళతాయి. సక్సెస్ ఫుల్ నిర్మాత మాత్రమే ఇక్కడ మనగలుగుతాడు. అలాగే మేం ఏమీ దానం చేయటానికి పరిశ్రమలో లేము..మాది పక్కా వ్యాపారం. అయినా ఎవరూ చూడడానికి ఇష్టపడని సినిమాలని ధియోటర్స్ ఉంటే మాత్రం ఫలితం ఏముంది.

మీరు ఈ చిన్న నిర్మాతలు ఏమన్నా సాయం చేస్తారా ఇది క్వాలిటీ,టాలెంట్ కావల్సి సినీ పరిశ్రమ...ఇక్కడెవరూ ఎవరికి సాయం చేయలేరు. మరి నష్టపోతున్న ఈ చిన్న బడ్జెట్ చిత్ర నిర్మాతలకు భాద్యత వహించేదెవరు అష్టాచెమ్మ,హ్యాపీడేస్ వంటి చిన్న బడ్జెట్ సినిమాలను మేమే మా ధియోటర్స్ లో ఆడించాం. అవి బాగున్నాయి కాబట్టి ఆడాయి. ఇక చిన్న నిర్మాతలను మొదట తమ స్టాండర్డ్స్ ని పెంచుకోమనండి.ఇలాంటి గొడవలు ఆపి మంచి సినిమాల నిర్మాణం మీద కాన్సర్ టేట్ చేస్తే మేలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X