twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీల ప్రకటన

    |

    కరోనా తర్వాత నిర్మాణం వ్యయాలు భారీగా పెరిగిపోవడమే కాక కలెక్షన్లు ఎంత వస్తున్నాయి అనే విషయం మీద ఏమాత్రం అవగాహన లేని నేపథ్యంలో సినీ నిర్మాతలు సినీ నిర్మాణ వ్యయాలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సినిమా షూటింగ్స్ సైతం నిలిపివేసి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్న తర్వాతే తిరిగి షూటింగ్స్ ప్రారంభించాలని భావిస్తున్నారు తాజాగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ కమిటీలు వేసింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుండి షూటింగ్‌లను నిలిపివేయాలని మంగళవారం అధికారికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    నిర్మాణ వ్యయం పెరగటం కారణంగా నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాక మళ్లీ షూటింగ్స్ ప్రారంభించింది. ఇక తమ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి గిల్డ్ తాజాగా కమిటీలను నియమించింది. అందులో భాగంగా థియేట్రికల్, ఎగ్జిబిషన్ సమస్యలపై చర్చించడానికి దిల్ రాజు కన్వీనర్ గా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, యువి వంశీ, వీరి నాయుడు, బన్నీవాసు, సాయిబాబు, అన్నపూర్ణ, రామ్ మోహన్, ఎన్వీ ప్రసాద్ తో ఓ కమిటి వేశారు. అలాగే ఓటీటీ హోల్డ్ బ్యాక్ పై చర్చకు బాపినీడు కన్వీనర్ గా ఏఎం రత్నం, పి.కిరణ్, మైత్రీ రవి, యువి వంశీ, శరత్ సభ్యులుగా మరో కమిటీని నియమించారు.

    producers guild announced committees for solving issues of Tollywood producers

    ఇక ప్రొడక్షన్ కాస్ట్ సమస్యలపై చర్చించేందుకు వివేక్ కూచిభొట్ల కన్వీనర్ గా నాగవంశీ, రవికిశోర్, శివలెంక కృష్ణప్రసాద్, మధు, కిషోర్, రాధామోహన్, 14 రీల్స్ గోపి, బెక్కం వేణు గోపాల్‌, చిట్టూరి శ్రీనివాస్, సుధాకర్ చెరుకూరి, దామోదర్ ప్రసాద్, సాహు గారపాటి, అనురాగ్ పర్వతనేనితో మరో కమిటీని నియమించారు. ఈ కమిటీలన్నీ నిర్మాతలకు ఉన్న సమస్యలపై చర్చించి, సాధ్యమైన మేరకు పరిష్కారాలను వెతికే ప్రయత్నం చేస్తాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ కమిటీలు సమస్యల మీద నిర్ణయం తీసుకునే వరకు షూటింగ్‌లను ఆపటానికి గిల్డ్ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. మరి ఈ కమిటీలు త్వరగా తగిన పరిష్కారాలను కనుగొని వీలయినంత త్వరగా షూటింగ్ లు ఆరంభించేలా చేస్తాయని ఆశిద్దామని అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    producers guild announced committees for solving issues of Tollywood producers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X