మీటూ ఉద్యమానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు
#మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉధృతం అవుతోంది. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా-నానా పాటేకర్ ఇష్యూ తర్వాత ఇది మరింత విస్తరించింది. కేవలం సినిమా రంగాన్నే కాదు రాజకీయ రంగంలో కూడా ఇందుకు సంబంధించిన ప్రకంపణలు కనిపిస్తున్నాయి.
మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణులు లైంగికంగా వేధించిన బాలీవుడ్ ప్రముఖులు సాజిద్ ఖాన్, రజత్ కపూర్, వికాస్ బహల్, సుభాష్ ఘై లాంటి పేర్లు బయటపెట్టడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో #మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 'ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులను అస్సలు సహించేది లేదని, వేధింపులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
దీంతో పాటు సినిమా ఇండస్ట్రీలో మహిళల సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. 'ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' రంగంలోకి దిగడంతో మీటూ ఉద్యమానికి మరింత మద్దతు లభించినట్లయింది.


Click it and Unblock the Notifications











