twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పదు.. విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?

    |

    Recommended Video

    విజయ్ అంటే ఇప్పుడు అల్లా టప్పా కాదు.. అందుకే ఇలా?

    కంటెంట్ ఉండాలే కానీ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు. 'అర్జున్ రెడ్డి'తో ఇదే నిరూపించాడు హీరో విజయ్ దేవరకొండ. ఒకే ఒక్క సినిమాతో యూత్‌లో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించాడు. అందుకే విజయ్‌తో సినిమాలు చేస్తున్నవాళ్లంతా ఇప్పుడు అలర్ట్ అయిపోయారు. 'అర్జున్ రెడ్డి'ని మరిపించే క్యారెక్టరైజేషన్‌తో విజయ్‌ని చూపించడం ఇప్పుడు వాళ్లకో సవాల్‌లా మారింది.. అదొక్కటే కాదు..

    దేవరకొండ.. నిజంగా కిరాక్ అబ్బా!, మనోడి క్రేజ్ మామూలుగా లేదు.. అక్కడ కూడా?దేవరకొండ.. నిజంగా కిరాక్ అబ్బా!, మనోడి క్రేజ్ మామూలుగా లేదు.. అక్కడ కూడా?

     బడ్జెట్ పెంచక తప్పట్లేదట..:

    బడ్జెట్ పెంచక తప్పట్లేదట..:

    'అర్జున్ రెడ్డి' కంటే ముందే విజయ్ దేవరకొండ కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాడు. అందులో గీత ఆర్ట్స్ బేనర్‌లో పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా ఉంది. నిజానికి ఈ సినిమా బడ్జెట్ తొలుత రూ.5కోట్లే అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ 'అర్జున్ రెడ్డి' చూశాక పునరాలోచనలో పడక తప్పలేదట.

     ఆ సినిమాకు రూ.10కోట్లు పైనే:

    ఆ సినిమాకు రూ.10కోట్లు పైనే:

    'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండకు పెరిగిన పాపులారిటీ రీత్యా.. కచ్చితంగా ఈ హీరో సినిమాలకు ఓపెనింగ్స్ ఢోకా ఉండదన్న అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. అందుకే.. గీత ఆర్ట్స్ సైతం నిర్మాణ విలువల విషయంలో ఎక్కడ తగ్గవద్దన్న ఉద్దేశంతో బడ్జెట్ పెంచినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.10కోట్ల పైచిలుకు బడ్జెట్ తో విజయ్ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

     విజయ్‌తో పరుశురామ్ 'రీషూట్':

    విజయ్‌తో పరుశురామ్ 'రీషూట్':

    రెండో సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్‌ని.. అర్జున్ రెడ్డి పాత్రను మరిపించేలా చూపించడం దర్శకులకు ఇప్పుడో పెద్ద సవాల్‌గా మారింది.

    అర్జున్ రెడ్డి చూశాక.. దర్శకుడు పరుశురామ్ కొన్ని సీన్లు మళ్లీ రీషూట్ చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌కి ఉన్న క్రేజ్ రీత్యా.. ఆ అంచనాల్ని అందుకునేందుకు పరుశురామ్ బాగానే కష్టపడుతున్నాడట.

     అదొక్కటే కాదు..:

    అదొక్కటే కాదు..:

    పరుశురామ్ సినిమా ఒక్కటేకాదు.. 'అర్జున్ రెడ్డి' కంటే ముందే విజయ్‌తో సినిమా మొదలుపెట్టినవాళ్లంతా ఇప్పుడు బడ్జెట్, స్క్రిప్టు విషయంలో మళ్లీ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి లాంటి సూపర్ డూపర్ సినిమా తర్వాత విజయ్‌ని అల్లా టప్పాగా చూపిస్తే విమర్శలు తప్పవనే భయం వారిని వెంటాడుతోంది. అందుకే హీరో క్యారెక్టరైజేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    విజయ్ ఫన్నీ ట్వీట్:

    రీల్ లైఫే కాదు.. రియల్ లైఫ్ లోనూ విజయ్ మాట తీరు అంతే సహజంగా ఉంటుంది. తాజాగా తనదైన శైలిలో విజయ్ ఓ ఫన్నీ ట్వీట్ చేశారు.

    వేప ఆకులు, తంగేడు పూలు, గులాబీ రెమ్మలతో 'అర్జున్ రెడ్డి' లుక్ ని తలపించేలా చిత్రాన్ని డిజైన్ చేసిన ఓ అభిమానిని ఉద్దేశించి.. 'అన్నా.. నీకో దండం..' అంటూ ట్వీట్ చేశాడు విజయ్. సంక్రాంతి కానుకగా ఓ అభిమాని విజయ్‌కి దీన్ని కానుకగా ఇచ్చాడు.

    English summary
    Almost all the movies Vijay Devarakonda did till now are of a budget of below 5 crores but in this upcoming movie with Geetha arts the budget of the movie is expected to be Rs. 10 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X