twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ సెటిల్ మెంట్: వీరప్పన్‌ భార్యకు రూ.25 లక్షల పరిహారం

    By Srikanya
    |

    న్యూఢిల్లీ: గంధపు చెక్కల స్మగ్లర్‌, అడవి దొంగ వీరప్పన్‌ జీవిత విశేషాల ఆధారంగా తీసిన 'వనయుద్ధం' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు నుంచి నిర్మాతలకు అనుమతి లభించింది. ఈ చిత్రం విడుదల తర్వాత తమ కుటుంబం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వీరప్పన్‌ భార్య వి.ముత్తులక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అక్షయ క్రియేషన్స్‌ నిర్మాతలు రూ.25 లక్షలను పరిహారంగా ఆమెకు అందజేసేందుకు ముందుకొచ్చారు.

    మరో ప్రక్క వీరప్పన్‌ నలుగురు అనుచరుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించడం పట్ల అంతర్జాతీయ కారుణ్య సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌' ఆందోళన వ్యక్తం చేసింది. వారికి శిక్ష విధించడాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

    తన భర్తను ఉరితీస్తే కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడతానని వీరప్పన్‌ అనుచరుడు మాదయ్య భార్య తంగమ్మాల్‌ పేర్కొంది. 1993లో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని పాలార్‌ వద్ద మందు పాతర పేల్చి 21 మందిని బలితీసుకున్న కేసులో వీరప్పన్‌ అనుచరులు జ్ఞానప్రకాశం, సియోన్‌, మాదయ్య, జితేందర్‌లకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. వీరు పెట్టుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు.

    దీంతో మాదయ్య భార్య తంగమ్మ మాట్లాడుతూ.. భర్తకు ఉరిశిక్ష విధిస్తే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. మరోవైపు, వీరప్పన్‌ అనుచరులకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ వీసీకే అధినేత తిరుమావళవన్‌, పీఎంకే నేత రామదాసు డిమాండ్‌ చేశారు. వీరప్పన్‌ సహచరులైన నలుగురికి ఉరి వేసేందుకు అధికారులు ఇక్కడి హిండలగా జైల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉరి రిహార్సల్స్‌ నిర్వహించారు. ఉరిశిక్షను ఎప్పుడు అమలు చేసేదీ వెల్లడించేందుకు జైలు అధికారులు నిరాకరించారు.

    English summary
    The Supreme Court today paved the way for the screening of Tamil film “Vanayuddham” based on the life of sandalwood smuggler Veerappan after the producers agreed to pay Rs 25 lakh as compensation to his wife. V Muthu Lakshmi, widow of the forest brigand, had filed the petition against the Madras High Court decision allowing the release of the film after the producers had agreed to cut some scenes objected by her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X