నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్
తెలుగు సినీ పరిశ్రమలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ వివాదానికి కారణం పరభాషా డబ్బింగ్ చిత్రాలే. డబ్బింగ్ చిత్రాల వల్ల తాము తీవ్రంగా నష్ట పోతున్నామని, వాటిని రాకను ఎంతో కొంత నిరోధించడానికి వాటిపై టాక్స్ పెంచి, తెలుగు చిన్న నిర్మాతల సినిమాలకు టాక్స్ మినహాయింపు ఇవ్వాలని చిన్న సినిమాల నిర్మాతల మండలి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. చిన్న నిర్మాతల డిమాండ్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు శనివారం విజయవాడలో సమావేశమై ఎగ్జిబిటర్ల సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటికే థియేటర్లు మూసి వేసే పరిస్థితి ఉందని, డబ్బింగ్ సినిమాలపై పన్ను పెంచితే తాము మరింత నష్ట పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సినిమా థియేటర్లు లాభాల్లో నడిచేవని, కాని ఇప్పడు పరిస్థితి మారిందన్నారు. థియేటర్లు నడిపించడం కన్నా...వాటిని కళ్యాణ మంటపాలుగానో, షాపింగ్ కాంప్లెక్స్ గానో మారిస్తే బాగుంటుందనే పరిస్థితులు దాపురించాయన్నారు. డబ్బింగ్ సినిమాలపై ఇప్పుడున్న టాక్సు విధానాన్నే కొనసాగించాలని ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications