బోర్డర్లో యుద్ధ మేఘాలు.. ‘సర్జికల్ స్ట్రైక్ 2’ టైటిల్ కోసం నిర్మాతల కొట్లాట!
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయడంతో.. దేశం మొత్తం సరిహద్దులో జరుగుతున్న పరిణామాల ఉత్కంఠగా గమనిస్తూ రెండు మూడు రోజులుగా టీవీలకు అతుక్కుపోయారు.
అయితే ముంబై సినీ సర్కిల్‌లో పరిస్థితి మరోలా ఉంది. పలు చిత్ర నిర్మాణ సంస్థలు 'మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్'కు సర్జికల్ స్ట్రైక్ మీద తాము తీయబోయే సినిమాలకు టైటిల్ రిజిస్టర్ చేయడానికి పోటీ పడుతున్నారట.

రిజిస్టర్ అయిన టైటిల్స్ ఇవే
ముంబై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 5 సినీ నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ మూవీ టైటిల్స్ రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. ‘ఫ్రమ్ పుల్వామా: ది టెర్రర్ ఎటాక్', ‘పుల్వామా ఎటాక్ వర్సెస్ సర్జికల్ స్ట్రైక్ 2.0', ‘సర్జికల్ స్ట్రైక్ 2.0', ‘బాలాకోట్'... లాంటి టైటిల్స్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.

ఆ మూవీ హిట్టవ్వడంతో అందరిలోనూ ఆశ
దీంతో పాటు వార్ రూమ్, హిందూస్థాన్ హమారా హై, పుల్వామా టెర్రర్ ఎటాక్, ది ఎటాక్ ఆఫ్ పుల్వామా, విత్ లవ్, ఫ్రమ్ ఇండియా, ఎటిఎస్-వన్ మ్యాన్ షో లాంటి టైటిల్స్ కూడా రిజిస్టర్ అయినట్లు సమాచారం. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్' పేరుతో వచ్చిన సినిమా బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ‘సర్జికల్ స్ట్రైక్ 2' అనే కొత్త ఆశ పుట్టుకొచ్చింది.

క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా
పుల్వామా ఉగ్రదాడి, భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతీకార దాడి, భారత్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం లాంటి సంఘటనలను సినిమా రూపంలోకి తెచ్చి క్యాష్ చేసుకునేందుకు పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

300 మంది ఉగ్రవాదులు హతం
పుల్వామా దాడి జరిగిన 12 రోజుల అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి ఫిబ్రవరి 26న తెల్లవారు ఝామున బాలాకోట్ ప్రాంతంలో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాలపై వెయ్యి కిలోల బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











