సూర్యతేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘ప్రొఫెసర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
వినాయకుడు, శంభో శివ శంభో, ఫ్రెండ్స్ బుక్, అప్పుడలా- ఇప్పుడిలా లాంటి చిత్రాల్లో నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ప్రేక్షకులను మెప్పించిన సూర్య తేజ్ సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆల్ రౌండర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యతేజ్.... ఈ ఏడాది మేళా, ప్రొఫెసర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూర్యతేజ్ పుట్టినరోజు సందర్భంగా అతడిని విష్ చేస్తూ 'ప్రొఫెసర్' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మనో వికాస్ దర్శకత్వం వహిస్తుననారు. ప్రకాష్ యాదవ్ నిర్మాత. పిఎస్పి ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య తేజ్, సెబా కౌష, దినేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి రచన: సెబా కౌషి, మనో వికాస్, సినిమాటోగ్రఫీ: కె.ఎ.స్వామి, కూర్పు : గౌతం నెరుసు, మాటలు : ప్రశాంత్ గొండ్లపల్లి, సంగీతం: శ్రావణ్ ఎస్. మిక్కీ, ఆర్ట్: రమేష్ దర, పాటలు: వాణి మాధవి అవసరాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చైతన్య వల్లూరు, నిర్మాత :ప్రకాష్ యాదవ్, దర్శకత్వం : మనో వికాస్.


Click it and Unblock the Notifications











