ఏపి గవర్నమెంట్ పై ప్రభాస్ నిర్మాత కాంట్రవర్సీ కామెంట్స్.. రౌడీ, గుండాలు అంటూ
ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ తీసుకునే నిర్ణయాలపై టాలీవుడ్ లో చాలా మందికి అస్సలు పడదని అంటుంటారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ, తెలుగు దేశం సపోర్తర్స్ టాలీవుడ్ లో ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం నిర్మాతలుగా ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీలుగా కూడా పోటీ చేశారు. వీరిలో అశ్వినీదత్ కూడా ఒకరు. తాజాగా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన విమర్శలు సంచలనంగా మారాయి.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మోసగాళ్ళకి మోసగాళ్ళు సినిమాని రీరిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు, నిర్మాత ఆదిశేషగిరిరావుతో పాటు మరికొంత మంది నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నంది అవార్డుల గురించి ఆదిశేషగిరిరావు మాట్లాడారు.

ఒకప్పుడు నంది అవార్డులు అంటే ఎంతో ప్రాధాన్యత ఉండేవని, అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని పూర్తిగా పక్కన పెట్టేసాయని అన్నారు. ఎవరు నంది అవార్డులు ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. ఈ సమావేశంలో అశ్వినీదత్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే అవార్డులకి వేల్యూ లేకుండా పోయిందన్నారు.
ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తున్నారని వ్యంగ్యంగా వైసీపీపై కామెంట్స్ చేశారు. మరో మూడేళ్ళలో ఆవార్డులు ఘనంగా ఇచ్చే రోజులు వస్తాయని అన్నారు. ఇప్పుడు అస్వినీదత్ చేసిన కామెంట్స్ వైసీపీ నాయకలకి, కార్యకర్తలకి మంట పుట్టిస్తున్నారు. మరి వాటిపై వైసీపీ క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.
కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్టీఆర్ శతాబ్ది జయంతి వేడుకలో పాల్గొని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వీటిపై వైసీపీ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు మూకుమ్మడిగా దాడి చేశారు. కొంతమంది మంత్రులు అయితే తమకి అలవాటైన బూతులతోనే రజినీకాంత్ పై విమర్శలు చేశారు. చంద్రబాబుని పొగడటం పాపం అన్నట్లు అందరూ వ్యవహరించారు. అలాంటిది అశ్వినీదత్ చేసిన కామెంట్స్ పై రియాక్ట్ కాకుండా ఉంటారా అనేది చూడాలి


Click it and Unblock the Notifications











