twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుక్కతో సినిమా చేస్తా... సందీప్ కిషన్‌తో చేయను, మోసగాడు: నిర్మాత కంటతడి!

    By Bojja Kumar
    |

    Recommended Video

    కుక్క తో నైనా సినిమా చేస్తాను కానీ.. సందీప్ కిషన్‌తో చేయను !

    తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ మీద నిర్మాత ఎస్.కె.బషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడో పెద్ద మోసగాడని, అతడితో సినిమాలు చేయవద్దని, అతడి మూలంగా తాను కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చిందని బషీద్ మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు.

    ప్రాజెక్ట్ జెడ్

    ప్రాజెక్ట్ జెడ్

    సందీప్ కిషన్ నటించిన తమిళ చిత్రం ‘మాయావన్' తెలుగు విడుదల హక్కులను బషీద్ దక్కించుకున్నారు. దీన్ని తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్' పేరుతో విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదల కాకుండా సందీప్ కిషన్ అడ్డుకున్నాడని, అతడి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని, నష్టపోయానని తెలిపారు.

    సందీప్ కిషన్ నా సినిమా పాలిట విలన్‌ అయ్యాడు

    సందీప్ కిషన్ నా సినిమా పాలిట విలన్‌ అయ్యాడు

    ఇండస్ట్రీలోకి ఎలాంటి ఫ్యామిలీ సపోర్టు లేకుండా వచ్చిన కొద్ది మందిలో నేనూ ఒకడిని. 2007లో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నవో, పెద్దవో సినిమాలు చేస్తున్నాను. ప్రతి సినిమా రిలీజ్‌కు ఒక విలన్ అనేవాడు ఉంటాడు. ఆ విలన్ పైరసీ రూపంలోనో, సినిమా విడుదలను డిస్ట్రబ్ చేసేవారి రూపంలోనో, ఫైనాన్స్ రూపంలో ఉంటారు. నా సినిమా విడుదలకు నా చిత్రంలో హీరోగా నటించిన సందీప్ కిషన్ విలన్‌లా తయారయ్యాడని, విడుదలకాకుండా అడ్డుకున్నాడని..... నిర్మాత ఎస్.కె.బషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

     సందీప్ కిషన్ కొనమంటేనే కొన్నాను

    సందీప్ కిషన్ కొనమంటేనే కొన్నాను

    ‘మాయావన్' సినిమా తమిళ ఆడియో ఫంక్షన్‌కు నేను వెళ్లాడు. అపుడు సందీప్ కిషన్ నన్ను సినిమా కొనాలని, తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని చెప్పారని.... ఆయన చెబితేనే తాను ఈ సినిమా కొన్నాను. కానీ సినిమా కొన్న తర్వాత అతడే అడ్డుకుని మోసం చేశాడని ఎస్.కె.బషీద్ ఆవేదన వ్యక్తం చేశారు.

     ఆల్రెడీ తమిళంలో ఒకరు చనిపోయారు

    ఆల్రెడీ తమిళంలో ఒకరు చనిపోయారు

    ‘మాయావన్' చిత్రానికి తమిళంలో అన్బు ఫైనాన్స్ వారు ఫైనాన్స్ చేశారు. సివి కుమార్, సత్య కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి మధ్య ఏదో గొడవలు వచ్చి వాళ్ల పార్ట్‌నర్ సత్య సూసైడ్ చేసుకున్నాడు. ఫైనాన్స్ ప్రాబ్లంతో రెండు సార్లు డేట్ వేసి రిలీజ్ చేయలేదు. ఆయన సూసైడ్ చేసుకోగానే అక్కడ బ్లాక్ మెయిల్ చేసి, పోలీసుల దగ్గరకు వెళ్లి, డ్రామా ఆడి తమిళంలో విడుదల చేశారు. తెలుగులో సైమల్టేషన్ రిలీజ్ ఉన్నా...నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని ఎస్.కె.బషీద్ తెలిపారు.

    విజయవాడ వాళ్ల దగ్గర 75 లక్షలు తీసుకున్నారు

    విజయవాడ వాళ్ల దగ్గర 75 లక్షలు తీసుకున్నారు

    ఓ వైపు సినిమాను నాకు అమ్మి.... మరో వైపు విజయవాడ కేశినేని వాళ్లకు 75 లక్షలకు అమ్మారు. నాకు భయం వేసి వెంటనే కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నాను. వెంటనే రిలీజ్ కు సినిమా సిద్ధం చేశాను అని ఎస్.కె. బషీద్ తెలిపారు. కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లందరికీ సందీప్ కిషన్ ఫోన్ చేసి ఈ సినిమా విడుదల కాదు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశాడని ఎస్.కె.బషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

     తెలుగు గురించి నీచంగా మాట్లాడారు

    తెలుగు గురించి నీచంగా మాట్లాడారు

    సినిమా పబ్లిసిటీకి రమ్మంటే.... తెలుగులో నా సినిమాలు పెద్దగా చూడరు, తమిళంలోనే చూస్తారు. అందుకే నేను రాను అని చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం ఎందుకు? తమిళనాడు వెళ్లిపోవచ్చుకదా.... అంటూ ఎస్.కె.బషీద్ మండి పడ్డారు.

    సందీప్ కిషన్‌తో సినిమాలు చేస్తే జీవితాలు పోతున్నాయి

    సందీప్ కిషన్‌తో సినిమాలు చేస్తే జీవితాలు పోతున్నాయి

    సందీప్ కిషన్ లాంటి వారితో సినిమాలు చేస్తే జీవితాలు పోతున్నాయని, ఆల్రెడీ తమిళంలో ఒకరు ఆత్మహత్య చేసకున్నారు. తెలుగులో ఆయనతో నక్షత్రం సినిమా చేసిన నిర్మాతకు హార్ట్ ఎటాక్ వచ్చింది. నా గుండె గట్టిది కాబట్టి నేను నిలబడగలిగాను అని.... ఎస్.కె.బషీద్ అన్నారు.

    కుక్కను పెట్టైనా తీస్తాను... సందీప్‌తో చేయను

    కుక్కను పెట్టైనా తీస్తాను... సందీప్‌తో చేయను

    రాజమౌళిగారు ఇటీవల ఈగను పెట్టి సినిమా చేశారు. అలాగే నేను కుక్క పిల్లను పెట్టైనా సినిమా తీస్తాను కానీ.... సందీప్ కిషన్ లాంటి మోసగాడితో సినిమా చేయను. దయచేసి ఎవరూ అతడితో సినిమాలు చేయవద్దని, నా లాగే మీకూ జరుగొచ్చని ఎస్.కె.బషీద్ వేడుకున్నారు.

    మూడు కోట్ల 50 లక్షలు నష్టపోయా

    మూడు కోట్ల 50 లక్షలు నష్టపోయా

    ‘యామావన్' తెలుగు రైట్స్ రూ. 3 కోట్ల 50 లక్షలకు కొని ‘ప్రాజెక్ట్ జెడ్' పేరుతో విడుదల చేశాను. సందీప్ కిషన్ సినిమాను అడ్డుకోవడం వల్ల తన డబ్బు అంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బషీద్ తెలిపారు.

     హాకర్లకు 15 లక్షలు ఇవ్వమన్నాడు

    హాకర్లకు 15 లక్షలు ఇవ్వమన్నాడు

    సోషల్ మీడియాలో సందీప్ కిషన్ చేసే పోస్టులకు లైక్స్ పెంచేందుకు ముగ్గురు హ్యాకర్లను పెట్టుకున్నాడు. వారికి 15 లక్షలు ఇవ్వమని చెప్పాడు. వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటని బషీద్ మండి పడ్డారు.

     దిల్ రాజు లాంటి వారు ఎక్కడికెళ్లారు?

    దిల్ రాజు లాంటి వారు ఎక్కడికెళ్లారు?

    నాకు మరింత నష్టం తేవడానికి సందీప్ కిషన్, ఆర్కే మీడియా వారు కలిసి సివి కుమార్ దగ్గర ఉన్న ప్రింటును తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఇది పైరసీ కాదా? పైరసీ అరికడదామని చెప్పే దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడికి వెళ్లినట్లు? అని ఎస్.కె. బషీద్ ప్రశ్నించారు.

     సందీప్ కిషన్ నా కొంప ముంచాడు

    సందీప్ కిషన్ నా కొంప ముంచాడు

    సందీప్ కిషన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ప్లాపే. అందుకే అతడితో ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించలేదు. నన్ను బ్రదర్ బ్రదర్ అంటూనే నా కొంప ముంచాడు. అతడితో ఎవరు సినిమాలు చేసినా వారి కొంప మునుగుతుంది అని ఎస్.కె. బషీద్ అన్నారు.

    English summary
    Project Z Producer SK Basheed Fires On Sundeep Kishan. He said Sandeep Kishan was a big cheat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X