ఒక్కోసారి అంతే మన చేతిలో ఏమి ఉండదు.అన్న రీతిలో జెనీలియా పరిస్దితి తయారయ్యింది.తెలుగులో కష్టపడి మరీ నటిస్తున్నాహిట్లు వస్తున్నా ఆఫర్లు మాత్రం ఆశించిన రీతిలో రావటం లేదు.తమిళంలోనూ అదే పరిస్ధితి రీపీట్ అవుతోంది.శంకర్ లాంటి మెగా దర్శకుడే (బాయ్స్)ఆమె దురదృష్టం ముందు నిలబడలేకపోయాడు..విజయ్ లాంటి బిగ్ స్టార్ సైతం ఆమె కెరిర్ ను ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు..అని తమిళ సినీ వర్గాలు,అక్కడ మీడియా పనిగట్టుకుని మరీ అల్లరి చేస్తున్నాయి.ఇప్పుడు ఆమె బొమ్మరిల్లు తమళ రీమేక్ లో జయం రవి ప్రక్కన నటిస్తోంది.ఇక్కడ సూపర్ హిట్ అయిన హాసిని క్యారెక్టర్ అక్కడ ఏ రేంజిలో వర్కవుట్ అవుతుందో గాని..ఓ ఎ.ఫ్.ఎమ్ రేడియో వాళ్ళు మాత్రం జాగ్రత్త అంటూ నిర్మాతలను హెచ్చరిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.తెరపై నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ అమ్మాయికి ఇవేం కష్టాలో..పాపం