»   » బోని కపూర్ అలా చేస్తాడని డౌటా..అంతా నాదే అని తెగేసి చెప్పిన శ్రీదేవి?

బోని కపూర్ అలా చేస్తాడని డౌటా..అంతా నాదే అని తెగేసి చెప్పిన శ్రీదేవి?

Subscribe to Filmibeat Telugu

రోజులు గడుస్తున్న కొద్ది అతిలోక సుందరి శ్రీదేవి మృతిలో షాక్ కి గురిచేసే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీదేవి మరణించిందనే వార్త మినహా, ఆమె మరణానికి కారణమైన పరిస్థితులు గురించి ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు, ధృవీకరించలేదు. దీనితో శ్రీదేవి మృతి పట్ల భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Sridevi News : Dubai Police Examining Phone Records
కుటుంబ కలహాలు

కుటుంబ కలహాలు

శ్రీదేవి మృతికి కుటుంబ కలహాలు కారణం అంటూ తాజగా వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి బోనికపూర్ వైవాహిక జీవితం సాఫీగా సాగిందని అందరికి తెలిసిందే. లోలోపల కుటుంబ కలహాలు ఉన్నాయనే వార్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.

బోనికపూర్ అలా చేస్తాడని శ్రీదేవి భయమా

బోనికపూర్ అలా చేస్తాడని శ్రీదేవి భయమా

బోనికపూర్ తన ఆస్తిలో వాటా మొదటి భార్య పిల్లలకు ఇస్తాడేమో అనే ఆందోళన శ్రీదేవిని వెంటాడేది వార్తలు వస్తున్నాయి.

పెళ్ళిలో జరిగిన గొడవ అదేనా

పెళ్ళిలో జరిగిన గొడవ అదేనా

దుబాయ్ లో జరిగిన మోహిత్ మార్వా వివాహ వేడుకలో బోని కపూర్ మొదటి భార్య బంధువులు ఆస్తి వాటా విషయంలో అతడిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి బోనికపూర్ సుముఖం వ్యక్తం చేయడంతో శ్రీదేవి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు కథనాలు వస్తున్నాయి.

ఆస్తి మొత్తం నాదే

ఆస్తి మొత్తం నాదే

బోనికపూర్ మొదటి భార్య బంధువులతో జరిగిన గొడవలో శ్రీదేవి ఒంటరిగా మారిందని, దీనితో శ్రీదేవిలో ఆందోళన ఎక్కువైపోయి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోని కపూర్ తో శ్రీదేవి ఆస్తి మొత్తం నాదే అని తెగేసి చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

నోరు మెదపని బంధువులు

నోరు మెదపని బంధువులు

శ్రీదేవి మృతి చెంది మూడురోజులుగా ఆమె పార్థివ దేహం దుబాయ్ లోనే ఉంది. కానీ ఇప్పటికీ అసలు విషయం ఏమిటని శ్రీదేవి కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు.

బోని కపూర్ ఆ విషయం తెలిసే

బోని కపూర్ ఆ విషయం తెలిసే

బోనీ కపూర్ దుబాయ్ నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. వెనువెంటనే శ్రీదేవిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్లినట్లు చెబుతున్నారు. అక్కడే అనుమానాలు రేకెత్తుతున్నాయి. శ్రీదేవిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళారా లేక ఆమె మరణ వార్త తెలిసి వెళ్లారనే అనే ప్రశ్న తలెత్తుతోంది.

English summary
Property issues between Sridevi and Boney Kapoor. Sridevi gets disturb with this issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu