twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేపు సినిమా బంద్ లేదు

    By Bojja Kumar
    |

    సినిమా రంగంపై కేంద్ర ప్రభుత్వం సర్వీస్ టాక్స్ విధించడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 23న దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ పరిశ్రమలు బంద్‌ పాటించాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిం తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సమావేశం అయిన తెలుగు పిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించారు.

    అయితే తాజాగా ఈ బంద్‌ నుంచి తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు పక్కకు తప్పకున్నాయి. రేపు జరిగే బంద్‌లో పాలు పంచుకోవడం లేదు. కేంద్ర మంత్రులతో ఆంద్రప్రదేవ్ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల మండలి అధ్యక్షుడు బూరుగుపల్లి శివరామకృష్ణ ధృవీకరించారు.

    తెలుగు సినీ పరిశ్రమతో పాటు, దేశంలోని ఇతర సినీ పరిశ్రమలు కూడా చాలా నష్టాల్లో ఉన్నాయి. నిర్మాణం అయిన సినిమాలతో పోలిస్తే లాభాలు తెచ్చే సినిమాలు చాలా తక్కువ. ఇప్పటికే పలు రకాల పన్నులు ప్రతి సినిమాకు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యం సర్వీస్ టాక్స్ పేరుతో మరో పన్ను విధిస్తే తట్టుకోవడం మా వల్ల కాదని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.

    English summary
    The Andhra Pradesh Film Chamber of Commerce has, after discussions with representatives of other industry-related bodies, called off the proposed bandh in protest against the 10.3 per cent service tax, on February 23, deciding instead to give time to the Central government till the presentation of the budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X