వ్యభిచారం తప్పుకాదు, ఎంతో మంది ఎఫైర్లు పెట్టుకుంటున్నారు: నటి సంచలనం
సినిమా తారలు కొందరు అవకాశాలు లేక వ్యభిచారం వైపు వెళుతున్న సందర్భాలు, కొన్ని సందర్భాల్లో పోలీసులకు చిక్కిన సంఘటనలు తరచూ చూస్తేనే ఉన్నాం. కడుపు కాలి, ఉపాధి లేక అటు వైపు వెళుతున్నారు, అందులో తప్పేముంది? ప్రభుత్వం ఈ విషయంలో కాస్త ఆలోచించాలి. వ్యభిచారం కూడా ఒక వృత్తిగా గుర్తించి దానిపై ఉన్న నిషేధం ఎత్తి వేయాలని తెలుగు సినీ నటి స్వాతి నాయుడు కోరుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె వ్యభిచారం నిషేధించడం వల్ల సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే ప్రయత్నం చేశారు.

వ్యభిచారం తప్పుకాదు
దొంగతనం చేయొద్దు, మరొకరిని మోసం చేయకుండా ఏ పని చేసినా అది మంచి పనే. కొందరు వ్యభిచారం తప్పు అంటారు. నేనైతే దాన్ని తప్పు అనను. ఒక అమ్మాయి డబ్బుల కోసం పడుకుంటుంది. నీకు ఇష్టమైతే డబ్బులు ఇచ్చి నీ కోరిక తీర్చుకో, నువ్వు చేసేదంతా చేసి ఆమె చేసేది మాత్రమే తప్పు అని చిత్రీకరించడం సరైంది కాదని స్వాతి నాయుడు అన్నారు.

ఎంతో మంది ఇల్లీగల్ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు
వ్యభిచారం తప్పు అంటున్నారు... ఈ విషయం పక్కన పెడితే ఎంతో మంది అబ్బాయిలకు భార్య కాకుండా వేరే వారితో పడుకోవాలని ఉంటుంది. వ్యభిచారం నిషేధిస్తే వారు అవి చేయకుండా ఉంటున్నారా. పక్కనవారి సంసారాలు కూల్చుతున్నారు. నా మొగుడు బాగా చేయడం లేదు, ఈయన బాగా చేస్తున్నాడని ఆడవారు కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నాయని తెలిపారు.

అతడి తప్పు లేనపుడు ఇది తప్పెలా?
చాలా మంది మగాళ్లు గుండెలపై చెయ్యేసుకుని.. లైఫ్ టైమ్ భార్యతో తప్ప వేరే అమ్మాయితో సెక్స్ చేయలేదా? అంటే చాలా మంది చేశామనే చెబుతారు. చేసేవాడు తప్పుకానప్పడు అమ్మాయి వ్యభిచారం చేస్తే తప్పు ఎలా అవుతుంది?

మన దేశంలోనే ఇలా...
అన్ని దేశాల వాళ్లు వ్యభిచారాన్ని యాక్సెప్ట్ చేసినపుడు మన దేశంలో ఎందుకు ఇలాంటి నిబంధనలు పెట్టారో అర్థం కావడం లేదు. నీ మొగుడికి ఇస్టమై వెళ్లినపుడు ఆ అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదు. తమ మొగుళ్లు పాడవుతారని వాదించే ఆడవారు కూడా ఈ విషయం అర్తం చేసుకోవాలి.

మీడియా కూడా...
మీడియా వారు కూడా ఇలాంటి వాటిని పెద్ద సీన్ చేసి... ఆ అమ్మాయిని వంద సార్లు టీవీలో వేసి చూపిస్తుంటారు. వ్యభాచారంలో పట్టుబడిన వారిని ఆరు నెలలు జైల్లో వేసి ఇబ్బింది పెట్టడం సరికాదు. ఈ విషయంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు స్వాతి నాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











