twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీ గేమ్: వాళ్లు వ్యభిచారంలోకి...వీళ్లు నటనలోకి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కారణాలు ఏమైనా పలువురు నటీమణులు వ్యభిచార కూపంలోకి వెళ్లి పోతుంటే......దాదాపు వ్యభిచారం లాంటి వృత్తిని కొనసాగించిన కొందరు భామలు నటనా రంగంలోకి వస్తున్నారు. విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. ఇటీవల భారతీయ సినిమా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

    నిన్న శ్వేతా బసు, మొన్న టీవీ నటి శ్రావణి, అంతకు ముందు మరో నటి ఇలా తరచూ సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతుండటం చూస్తూనే ఉన్నాం. మరి పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణాలు ఏమిటి? అవకాశాలు లేక పోవడమేనా? అంటే ఆలోచించాల్సిన విషయమే. పరిశ్రమలోని కొందరు వ్యక్తులు కూడా హీరోయిన్లు ఇలా తప్పుడు దారి పట్టడానికి కారణం అనే వాదన వినిపిస్తోంది.

     Prostitution Shocker: What happened to Tollywood actress

    విచిత్రం ఏమిటంటే గతంలో పోర్న్ సినిమాల్లో(వ్యబిచారం లాంటిదే) నటించిన సన్నీ లియోన్ లాంటి వారికి భారతీయ సినిమాల్లో భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇక్కడున్న హీరోయిన్లు అవకాశాలు లేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల వెనక కారణం ఏమిటి? అంటే నటనపై కాకుండా డబ్బుపై మోజుతో ఇండస్ట్రీ బాట పడుతున్న వారి వల్లే ఇలాంటి చోటు చేసుకుంటున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇదంతా ఇండస్ట్రీ ఆడుతున్న వింత గేమ్.

    అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.

    అవకాశాలు తగ్గిపోయిన పలువురు హీరోయిన్లు, కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు....ఈజీ మనీకోసం ఇలాంటి అడ్డదారిలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా నటనను కెరీర్ ఎంచుకునే మహిళలకు సమాజంలో ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

    ఇప్పటి వరకు సీనియర్ నటి కిన్నెర, యమునలతో పాటు భువనేశ్వరి, సైరా భాను, జ్యోతిలతో పాటు ‘లయ', ‘హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన టీవీ నటి శ్రావణి తదితరులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. గత కొన్ని రోజుల క్రితం బెంగాళీ టీవీ నటి సుకన్య చటర్జీ పోలీసులకు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో హోటల్‌లో పట్టుబడింది. తాజాగా నిన్న నటి శ్వేతా బసు ప్రసాద్ పోలీసులకు వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

    English summary
    Prostitution Shocker: What happened to Tollywood actress Shweta Basu ... there are several other heroines who have gone through this phase.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X