twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అరవింద సమేత’పై ఆందోళన: ఆసీన్లు తీసేయాలి, త్రివిక్రమ్ క్షమాపణలు చెప్పాలి!

    |

    Recommended Video

    Aravinda Sametha : Rayalaseema Vidyarthi Porata Samithi Demands For Cuts

    ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమా ఓ వైపు బాక్సాఫీసు వద్ద విజయఢంకా మ్రోగిస్తూ భారీ వసూళ్లతో దూసుకెళుతుంటే... మరో వైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి.

    త్రివిక్రమ్ నా మీద తోయడం తప్పు, విషాదం నిండిన మా ఇంట్లో నవ్వు రేఖ: ఎన్టీఆర్ సెన్సేషనల్ స్పీచ్త్రివిక్రమ్ నా మీద తోయడం తప్పు, విషాదం నిండిన మా ఇంట్లో నవ్వు రేఖ: ఎన్టీఆర్ సెన్సేషనల్ స్పీచ్

    రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై... రాయలసీమకు చెందిన ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన మొదలు పెట్టాయి. ఈ సినిమాలో చూపిన కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

     మాపై ఎందుకింత కక్ష?

    మాపై ఎందుకింత కక్ష?

    రాయలసీమ ప్రాంతంపై తెలుగు సినీ పరిశ్రమ కక్ష గట్టిందని, అందుకే మా ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారని, వినోదం పేరుతో మా ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను చాలా దారుణంగా సినిమాల్లో ఫోకస్ చేస్తున్నారని రాయలసీమకు చెందిన నాయకులు ఆరోపించారు.

    త్రివిక్రమ్ మళ్లీ రెచ్చగొట్టాడు

    త్రివిక్రమ్ మళ్లీ రెచ్చగొట్టాడు

    రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత' సినిమా ద్వారా మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విద్యార్థి సంఘాల నేతలు మండి పడ్డారు. ఈ సినిమా వల్ల సీమలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు మొదలయ్యే అవకాశం లేక పోలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఆ సీన్లను, డైలాగులు తొలగించాలి

    ఆ సీన్లను, డైలాగులు తొలగించాలి

    ‘అరవింద సమేత' చిత్రంలో కొన్ని సన్నివేశాలు, మాటలు అభ్యంతరకంగా ఉన్నాయని, యువతరంపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా ఉన్నాయని... వాటిని వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

     త్రివిక్రమ్ క్షమాపణలు చెప్పాలి

    త్రివిక్రమ్ క్షమాపణలు చెప్పాలి

    రాయలసీమలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే విధంగా సినిమా తీసిన దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి, అందులోని అభ్యంతరకంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని... లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

    English summary
    Rayalaseema Vidyarthi Porata Samithi Protest against Aravinda Sametha movie. They are demanding the removal of the Faction scenes in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X