'రభస' రిలీజ్ కు అడ్డంకి: మంచు లక్ష్మి ట్విస్ట్

By Srikanya

హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో సంతోష్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం రభస. బెల్లంకొండ సురేష్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. అయితే ఊహించని ట్విస్ట్ ...మంచు లక్ష్మి రూపంలో వచ్చింది. తమకు పే చెయ్యాల్సిన పేమెంట్స్ ఇవ్వందే విడుదల చేయటానికి కుదరదని అంటున్నారు.

ప్రముఖ నటి మంచు లక్ష్మి అనుచురులు మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ధర్నా నిర్వహించారు. తమకు రావాల్సిన డబ్బలు ఇవ్వాలంటూ ఈ ధర్నా సాగింది. రాత్రి తొమ్మిది గంటల ప్రాతంలో ఈ ధర్నా చోటు చేసుకుంది. పోలీసులు సర్ధుబాటు చేసి పంపాల్సి వచ్చింది.

Protest at Bellamkonda's House for Payment

సంఘటన పూర్వాపరాల్లోకి వెళితే... మంచు లక్ష్మి నిర్మించిన ఊ కొడతారా...ఉలిక్కి పడతారా చిత్రం గంధర్వ మహల్ సెట్ ని నిర్మాత బెల్లంకొండ సురేష్ రభస చిత్రం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందు నిమిత్తం 58 లక్షల రూపాయలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఒప్పుకున్న పేమెంట్ ఇవ్వకపోవటంతో మంచు లక్ష్మి అనుచురులు ఇలా ధర్నాకు దిగారని తెలుస్తోంది.

ఇంతకుముందు ఇలాంటి వివాదాలను మధ్యవర్తులు ద్వారా పరిష్కరించుకునేవారు. అయితే ఇప్పుడు లక్ష్మి అభిమానులు..అనుచరులు అంటూ కొంతమంది ధర్నాకు దిగటం ఆశ్చర్యంగా ఉంది. ఇక డబ్బులు చెల్లించాకే సినిమాని విడుదల చేసుకోవాలని చెప్పారు. దాంతో బెల్లంకొండ సురేష్ ఇంటిముందు ఆందోళన పరిస్ధితి ఏర్పడింది. పోలీసులు వచ్చి సమీక్షించేవరకూ ఆగలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X