twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెప్పులతో కొట్టి.. భన్సాలీ దిష్టిబొమ్మ దగ్ధం.. ఢిలీకి పద్మావతి సెగ.. రెచ్చిపోయిన కార్యకర్తలు

    By Rajababu
    |

    Recommended Video

    మరీ ఇంత దారుణమా ? ఢిల్లీకి పద్మావతి సెగ

    పద్మావతి చిత్ర వివాదం ఇప్పుడు దేశ రాజధానికి చేరుకొన్నది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రపతి చేత్న మంచ్ అనే హిందుత్వ సంస్థ ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించింది. ఇందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాలుపంచుకోవడం మరింత వివాదంగా మారింది. రాజ్‌పుత్ కమ్యూనిటికి చెందిన కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వ్యతిరేకంగా పలు హిందుత్వ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

     ఢిల్లీలో భారీ ర్యాలీ

    ఢిల్లీలో భారీ ర్యాలీ

    పద్మావతి చిత్రానికి, భన్సాలీకి వ్యతిరేకంగా పలు హిందూత్వ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి ప్రాంతంలో భారీ ర్యాలీని నిర్వహించారు. భన్సాలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భన్సాలీ చిత్ర పటానికి చెప్పుల దండలు వేసి ఊరేగించారు.

     చెప్పులతో కొట్టి.. దిష్టిబొమ్మను..

    చెప్పులతో కొట్టి.. దిష్టిబొమ్మను..

    పద్మావతికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆజాద్‌పూర్‌లోని ఓ కూడలిలో భన్సాలీ దిష్టిబొమ్మను మంటల్లో తగులబెట్టారు. దిష్టిబొమ్మ కాలుతుండగానే చెప్పులు విసిరి నిరసనను వ్యక్తం చేశారు. భన్సాలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

     పద్మావతి జాతికి ప్రతీక

    పద్మావతి జాతికి ప్రతీక

    పద్మావతి ఓ కమ్యూనిటికి చెందిన వారు కాదు. ఆమె దేశానికి మొత్తం ఓ ప్రతీక. శత్రుదేశాల రాజు దండయాత్ర చేయడంతో ఆత్మార్పణం చేసుకొన్నారు. అలాంటి త్యాగమూర్తి రాణి పద్మినీ చరిత్రకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. దేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా రూపొందించిన పద్మావతి చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నాం అని బీజేపీ నేత రోషన్ కెన్సల్ అన్నారు.

     సెన్సార్‌ బోర్డుపై మండిపాటు

    సెన్సార్‌ బోర్డుపై మండిపాటు

    ఢిల్లీలో పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడానికి ఒప్పుకోం. సెన్సార్ బోర్డుకు చరిత్ర తెలియదు. ఇలాంటి వివాదాస్పద సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందు రాజవంశాలకు చెందిన ప్రతినిధులు, చరిత్రకారులతో చర్చలు జరపాలి అని ఆందోళనకారులు అన్నారు.

    పద్మావతి వివాదానికి రాజకీయ రంగు

    పద్మావతి వివాదానికి రాజకీయ రంగు

    పద్మావతి చిత్రంపై నిరసన మొదట్లో కొన్ని హిందూ సంస్థలకే పరిమితం కాగా, ఇప్పుడు ఆ చిత్రానికి రాజకీయ రంగు పులుముకొంటున్నదనే విమర్శ వినిపిస్తున్నది. నిరసన, ఆందోళనకారులకు బీజేపీ కార్యకర్తలు బాహాటంగా మద్దతు తెలుపడం మరింత వివాదంగా మారుతున్నది.

    English summary
    The protests against Padmavati have now reached the capital. The right-wing group Rashtrapati Chetna Manch had organised the protest in which some Bharatiya Janata Party (BJP) functionaries also participated. Protest in the Azadpur area of Delhi against the film Padmavati and its director Sanjay Leela Bhansali. A protester said, We will not allow the movie to be released in Delhi. The censor board does not know history. Before giving permission for such movies, the board must consult the descendants of the Royal families and good historians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X