హీరో ఇంట పెళ్లి సందడి...అరెస్టు చేయాలని ధర్నా
హైదరాబాద్: బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ తన సోదరి అర్పిత వివాహాన్ని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. సోమవారం అయన, కుటుంబ సభ్యులు ఇక్కడకు చేరుకున్నారు. అర్పిత, ఆయూష్ శర్మల వివాహం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ పెళ్లి హడావిడి ఇలా ఉంటే...ఆయన్ను అరెస్టు చేయాలంటూ ధర్నా నిర్వహించారు.
'బిగ్‌బాస్' కార్యక్రమంలో ఒక వర్గంపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ కోర్టులో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త ఫసియుద్దీన్.. సల్మాన్‌ను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఆయనపై హైదరాబాద్‌లో ఐదు కేసులు ఉన్నందున వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ విషయమై సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ మాట్లాడుతూ... "నేను నా కూతురు పెళ్లికి వెళ్తున్నాను...నేను తండ్రిగా నా కూతురు వివాహం నిమిత్తం చాలా సంతోహంగా ఉన్నాను. నాకు ఈ వివాదం,ధర్నాలు గురించి తెలియదు...మేమంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నాం...." అన్నారు.
ఇక ఈ వివాహ వేడుకకు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సినీతారలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. మొత్తం 300 మంది ఆహ్వానితులని తెలిసింది. సల్మాన్ భద్రతా వ్యవహారాలను ముంబయికి చెందిన ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించారు.

రెండు రోజుల పెళ్లి సందడి..: రెండు రోజుల పాటు పెళ్లి సందడి కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి.. అనంతరం వధూవరుల పరిచయ కార్యక్రమం. రాత్రి బాలీవుడ్ నటీనటులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు రిసెప్షన్.
సోమవారం సల్మాన్ ఖాన్ వచ్చారని తెలియగానే వందల సంఖ్యలో అభిమానులు తాజ్ ఫలక్‌నుమాకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడు బయటకు రావాలంటూ వారు కేకలు వేయగా పోలీసులు సర్దిచెప్పి పంపించారు. ఈ వివాహవేడుకకు సల్మాన్ కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులను అనుమతించడం లేదు.
సల్మాన్ ఖాన్ సోదరి వివాహం అత్యంత ఆర్భాటంగా జరిపేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. తన ముద్దుల చెల్లిలి కోసం ఎంత ఖర్చయినా చేయడానికి వెనకాడటం లేదట సల్మాన్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరుగనుంది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వెంకటేష్ కూడా ఈ ఆహ్వానం అందుకున్నారు.


Click it and Unblock the Notifications











