twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు.. దయ చూపండి: హీరో రాజశేఖర్

    |

    తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఇతర భాషా నటుల తాకిడి పెరిగి పోయింది. కారణాలేమైనా దర్శక నిర్మాతలు హిందీ, తమిళం, మలయాళం చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ కారణంగా తెలుగు కళాకారులు అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు.... నిర్మాతలు, దర్శకులు, రచయితల దృష్టికి తీసుకెళ్లి తెలుగు వారికి అవాకశాలు కల్పించాలని విన్నవించారు. ఆ పాత్రకు, ఆ నటి లేదా నటుడు సరిపోతాడు అన్నపుడు అలాంటి వారిని ఏ పాత్రకు తీసుకున్నా పర్వాలేదు, ఈ పాత్రకు ఎవరైనా పర్వాలేదు అనే పాత్రలు అనేకం ఉంటాయి. అలాంటి పాత్రలకు దయచేసి 'మా' సభ్యులకు అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వారు టిఎఫ్‌ఐ కలెక్టివ్ కమిటీ చైర్‌పర్సన్ వై సుప్రియ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ శంకర్, రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరుచురు గోపాల కృష్ణను కలిశారు.

    మనం వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం కానీ, కానీ మనకు వాళ్లు ఇవ్వడం లేదు: అలీ

    మనం వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం కానీ, కానీ మనకు వాళ్లు ఇవ్వడం లేదు: అలీ

    మనం హిందీ, మలయాళంన తమిళం నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తాం. కానీ తెలుగు ఇండస్ట్రీ కళాకారులకు మాత్రం ఆ మూడు రాష్ట్రాలవారు వేషాలు ఇవ్వరు. మనం వారిని తీసుకొచ్చి, యాక్టింగ్ నేర్పించి, స్టార్ హోటల్ ఇచ్చి, డబ్బులిచ్చి, ఫేమ్ కూడా ఇస్తున్నాం. వాళ్లకు గుర్తింపు ఉంటుంది, కానీ తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు ఉండటం లేదని అలీ వ్యాఖ్యానించారు.

    తెలుగులో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు

    తెలుగులో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు

    దయచేసి దర్శకులు, నిర్మాతలు, రైటర్స్ తెలుగు కళాకారులను ఎంకరేజ్ చేయండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు అవకాశాలు ఇవ్వండి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు. వారికి పని కల్పించాలని అలీ విన్నవించారు.

    ఒక పూట తిండి లేకున్నా ఉంటారు

    ఒక పూట తిండి లేకున్నా ఉంటారు

    రాజశేఖర్ మాట్లాడుతూ... తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్. వారికి ఒక పూట ఫుడ్ ఉన్నా లేకున్నా వేషం ఉంటే చాలు అని ఫీలయ్యేవారు ఉన్నారు. చాలా మంది అవకాశాలు లేక డిప్రెషన్లోకి వెళుతున్నారని తెలిపారు.

    ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఏడ్చేశారు

    ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఏడ్చేశారు

    కొంతమంది కళాకారులు మా వద్దకు వచ్చి అవకాశాలు లేక, పూట గడవక మేము సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఏడ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నిర్మాతలు, దర్శకులు, కో డైరెక్టర్లు, రైటర్లు మన వాళ్లకు మనం చేసే హెల్ప్ గా భావించి అవకాశాలు ఇవ్వండి... అని రాజశేఖర్ కోరారు.

    English summary
    Members of the Movie Artist Association have asked Telugu producers, directors and writers to Provide opportunities for Telugu artists in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X