పీఆర్పీ టిక్కెట్టుకీ చరణ్ సినిమాకీ ముడి

ఇప్పటికే కొంతమంది ప్రజారాజ్యంకు దగ్గరవ్వాలనుకున్న వారు నాగేంద్రబాబు పై పెట్టుబడులు పెట్టి వరస సినిమాలు తీస్తూండటం తెలిసిందే. అదే కోవలో రామ్ చరణ్ తేజ సినిమా కొనటం ద్వారా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నట్లు పార్టీలో ఒక వర్గం గుసగుసలాడుతోంది. ఇక గజనీ హిట్ తో మంచి ఊపుమీదన్న అల్లు అరవింద్ ఈ క్రేజ్ ని ఎంతవరకూ క్యాష్ చేసుకుంటారనేది త్వరలో తేలనుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కాజల్ ప్రధాన పాత్రలో చేసిన ఈ చిత్రం సమ్మర్ కి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











