మియాపూర్: హద్దు మీరితే రోజా చీకటి జీవితపు అసలు స్వరూపాన్ని కరపత్రాలతో బయిటపెడతామని ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్ష్యురాలు శోభారాణి హెచ్చరించారు. సినిమాల్లో ఆశ్లీల దృశ్యాలతో నటించి యువకలును పెడదారి పట్టించిన టీడీపీ మహిళా నేత రోజా నీతులు మాట్లాడుతూంటే విడ్డూరంగా ఉన్నదని ఆమె విమర్శించారు. మియాపూర్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రజారాజ్యం పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు హద్దు మీరవద్దని అన్నారు. అలాగే ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే వాటికతి వ్యతిరేకంగా ఏనాడైనా నిరసన కార్యక్రమాలు చేశారా,మహిళల పట్ల రోజా ప్రేమ ఒలకపోయిడం విచిత్రంగా ఉన్నదని ఎద్దేవా చేసారు.
Story first published: Monday, February 23, 2009, 14:38 [IST]