twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కి మొదటికే మోసం

    By Staff
    |

    పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో 'చిరు' సినిమాల వైపువెళితే మొదటికే మోసం వస్తుందని ప్రజారాజ్యం పార్టీ నేతలు చాలామంది భావిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.నాలుగు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్‌ నేత, చిరంజీవికి పెద్దదిక్కుగా వ్యవహరించిన హరి రామజోగయ్య కూడా 'చిరు' మళ్లీ నటిస్తే బాగుంటుంద ని మీడియాతో అని చర్చకు తెరలేపారు. అంతేగాక ఆ మేరకు చిరంజీవికి సందేశాత్మక చిత్రాలలో నటించి అభిమానులకు మళ్ళీ దగ్గరకమ్మని సలహా కూడా ఇచ్చానని చెప్ప డం చర్చనీయాంశమైంది.

    దాంతో చిరంజీవి మళ్లీ వెండితెరపై కనిపిస్తే పార్టీకి కలిగే లాభనష్టాలను పార్టీ నేత లు బేరీజు వేస్తున్నారు. సీనియర్‌ నేతలు మాత్రం 'చిరు' రీ ఎంట్రీ అనవసరం అని భావిస్తున్నారు.మరికొంతమంది అయితే 'చిరు' సోదరుడు పవన్‌ కళ్యాణ్‌, కుమారుడు రాంచరణ్‌ తేజ ఇప్పటికే సినీ రంగంలో 'చిరు' ప్రతినిధులుగా ఉ న్నందున ప్రత్యేకంగా మళ్లీ చిరంజీవి సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏ ముందని గోదావరి జి ల్లాలకు చెందిన పార్టీ నేత ఒకరు ప్రశ్నించారు.అలాగే పార్టీకి ఉపయోగపడే విధంగా ఏదైనా సినిమా తీ యదలచుకుంటే మంచిదని, సందేశాత్మక చిత్రాలను ఎంచుకుని చిరంజీవి మళ్లీ నటిస్తే పార్టీకి మేలు చేకూరుతుందని చెబుతున్నారు.

    పవన్‌, రాంచరణ్‌ ఉన్నప్పటికీ జనంలో చిరంజీవి ప్రభావం వేరని వారు అంటున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నేత మాట్లాడుతూ... చిరంజీవి నటించడం ద్వారా ఎ న్నికల్లో కొంత దూరమైన అభిమానులను తిరిగి దరి చేర్చుకునే అవకాశం ఉంటుందని,సందేశాత్మక చిత్రాల ద్వారా పీఆర్పీ సిద్ధాంతా లు, విధానాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ కోసమే చిరంజీవి సినిమాల్లో నటించినప్పటికీ, ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేసే ప్రమాదం ఉన్నదన్నది మరికొందరి వాదన.ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి మాత్రం తన రీఎంట్రీ పై మాత్రం స్పష్టమైన ప్రకటన మాత్రం చేయటం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X