ప్రజారాజ్యం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్ష్యురాలు శోభారాణి భర్త రంగనాయకులను హైదరాబాద్ లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. తన భర్త నిత్యం తాగి వచ్చి తనను మానసికంగా, శారీరంకంగా వేధిస్తున్నాడంటూ శోభారాణి గత ఏడాది మే ఇరవై ఐదున పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై అప్పట్లోనే పోలీసులు కేసు నమేదు చేసారు. అయితే అప్పట్నుంచి రంగనాయకులు పరారీలో ఉన్నారు. బుధవారం ఎల్లారెడ్డిగూడలో ఉన్న శోభారాణి ఇంటికి మధ్యం సేవించి వచ్చిన రంగనాయకులు గలాటా సృష్టించారు. దీంతో ఆమె ఎస్.ఆర్.నగర్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపారు.