మెల్లిమెల్లిగా ఎలక్షన్ల వేడి పెరుగుతోంది. ఒకరి పై మరొకరు విమర్శ బాణాలతో దాడికి పూనుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో లేనివారిని సైతం టాపిక్ గా తీసుకొస్తున్నారు. తాజాగా....చంద్రబాబు చిత్త శుద్దితో జూనియర్ ఎన్టీఆర్ తల్లికి తెలుగు మహిళ అధ్యక్ష్య పదవి ఇస్తారా అని ప్రజారాజ్యం రాష్ట్ర అదికార ప్రతినిధి డాక్టర్ జాలాది విజయ ప్రశ్నించారు. పీఆర్పీ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఆమె పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు. చెన్నైలో పలు ఛీటింగ్ కేసుల్లో 420గా ముద్రపడిన రోజా ఆంధ్రాలో మాత్రం నీతులు చెదుబోతోందని ఆమె విమర్శించారు. ఇక రోజా ...ప్రజారాజ్యం పార్టీలో వారిని విమర్శించింది కాబట్టి ఆమెను వారు ఎత్తిపొడవటంలో తప్పులేదని, కానీ ఎన్టీఆర్ తల్లిని అనవసరంగా బయిటకు లాగాల్సిన పనేంముందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.