'రామ్ గోపాల్ వర్మ.. నేనొక సైకో’ ఫస్ట్ షో నేనే చూస్తా....?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతటి సవాళ్లనైనా ఇట్టే స్వీకరించేస్తారు. బెజవాడ రౌడీలు అనే టైటిల్‌తో నాగచైతన్య హీరోగా వర్మ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఈ టైటిల్‌పై విజయవాడలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే టైటిల్‌లో ఉన్నట్లు సినిమాలో రౌడీలెవరూ ఉండరనీ, అదో ప్రేమకథ అని రాము చెప్పినప్పటికీ నిరసన హోరు తగ్గలేదు. రీసెంట్ గా మహిళా రాజ్యం మాజీ అధ్యక్షురాలు శోభారాణి ఛాంబర్లో ప్రత్యక్షమై బెజవాడ రౌడీలు టైటిల్‌ను మార్చాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ బెజవాడ రౌడీలన్న టైటిల్‌కు మౌనాన్ని పాటిస్తే.. రేపు హైదరాబాద్ గూండాలనే పేరు కూడా పెడతారని మండిపడ్డ ఆమె చివరికి నా పేరు రాంగోపాల్ వర్మ.. నేనొక సైకో"ని అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించి బయటకు వెళ్లిపోయింది శోభ. మరి రాము ఇదంతా పట్టించుకుంటాడా..?అంటే ఇప్పుడు శోభరాణికి కౌంటరిచ్చాడు.
శోభారాణి 'రామ్ గోపాల్ వర్మ.. నేనొక సైకో"ని అనే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆ సినిమాని ఇపుడా పేరుతో ఎవరైనా సినిమా తీస్తే, ఆ సినిమా ఫస్ట్ షో తాను చూస్తానని రామ్ గోపాల్ వర్మ చెపుతున్నారు. అలా తాను చూడటం ద్వారా ఆ సినిమా తీసిన వారికి మంచి పబ్లిసిటీ కూడా వస్తుందని చెప్పుకొచ్చారు. కనుక టైటిళ్లు ఎలా ఉన్నా తీసే విధానంలో తేడా ఉండకూడదని వర్మ వెల్లడించారు. తాను తెరకెక్కిస్తున్న బెజవాడ రౌడీలు పేరుకే అలా ఉంటుందని సినిమా చూసిన తర్వాత అందులో ఉన్న విషయాన్ని చూసి మెచ్చుకుంటారని కితాబిస్తున్నారు.


Click it and Unblock the Notifications











