'కొమరం పులి' నిర్మాతలను డబ్బులడిన ఆధారాలు
"'కొమరం పులి' సినిమా నిర్మాతలను ఓయూ జేఏసీలో భాగమైన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు డబ్బులు అడిగినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నా యి. అయితే సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతాం. మేం చేసిన ఆరోపణలను ఆధారాలతో బయటపెడితే, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రత్యేక వాదాన్ని విడనాడి, సమైక్య వాదంవైపు మళ్లుతారా?" అని ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత శోభారాణి సవాల్ విసిరారు. తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. 24 గంటల్లో చెప్పాలంటూ చిరంజీవికి గడువు విధించడానికి టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. అలాగే...'కొమరం పులి'లో 'కొమరం' అనే పదాన్ని తొలగించడం వల్ల ఒక మహానుభావుడిని స్మరించుకునే అవకాశాన్ని తెలంగాణవాదులు కోల్పోయేటట్లు చేశారన్నారు.


Click it and Unblock the Notifications











