For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘శ్రీదేవి’ వివాదం: వర్మ సమాజం కోసం త్యాగం చేయాల్సిందే...

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ‘సావిత్రి' టైటిల్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ పై వివాదం రావడంతో ‘శ్రీదేవి'గా టైటిల్ మార్చారు. ఈ సినిమాను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతి ఆలచననూ సినిమాగా తీస్తామంటే మనం ఏర్పరుచుకున్న కట్టుబాట్లకు అర్థం ఉండదని రామ్ గోపాల్ వర్మను ఉద్దేశించి ఏపీ పీఆర్టీయూ అధ్యక్షుడు కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు అన్నారు. వర్మ తాను తీయాలనుకున్న ‘సావిత్ర/శ్రీదేవి' చిత్రాన్ని సమాజం కోసం త్యాగం చేయాల్సినందేనని కోరారు. యువతనను రెచ్చగొట్టే సినిమాలు తీయొద్దన్నారు.

  అయితే ఇలాంటి అభ్యంతరాలను వర్మ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వివమర్శలకు నా సమాధానం ఇలా ప్రకటన విడుదల చేసారు.....

  ఒక టీనేజ్ కుర్రాడు తన కన్నా పెద్దదైన అమ్మాయిపై అట్రాక్షన్ పెంచుకోవడం అనే అంశంతో రూపొందిన ‘మలీనా, సినిమా పరడిసో, సమ్మర్ ఆఫ్ 42, రాజ్ కపూర్ మేరా నామ్ జోకర్, తూర్పు పడమర' వంటి అనేక చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాయి. ఇపుడు నేను తీస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ చేయగానే, కొన్ని సంఘాల వాళ్లు విరుచుకుపడ్డారు. వాళందరికీ నేను ఒక వివరణ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నాను.

  PRTU objection on Ram Gopal Varma film

  కొంత మందికి నా సినిమా పోస్టర్ కంటే నా ప్రెస్ నోట్‌లో నేను ప్రస్తావించిన ‘సరస్వతీ టీచర్' అంశం ఎక్కువగా కోపం తెప్పించిందని తెలిసింది. నేను మల్లీ చెబుతున్నా..చిన్నప్పుడు నేను మా సరస్వతి టీచర్ కి అట్రాక్ట్ అయ్యేవాడిని. ఈ మాట నేను ఈ మధ్య ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడ దాన్ని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే...‘యవ్వనం వికసిస్తున్న రోజుల్లో అలాంటి భావాలు కలుగడం చాలా సహజం' అనే ఇంగిత జ్ఞానం ఆవిడకు ఉంది కాబట్టి! ఆవిడకే ఏ సమస్య లేనప్పుడు, వేరే ఏమీ తెలియనివాళ్లకు ఏం సమస్యో...నాకు సమస్య అయ్యి కూర్చుంది.

  ఇక నా సినిమా పోస్టర్ చూసి, కథేమిటో వాళ్లే ఊహించేసుకుని...పోస్టర్ లో ఉన్న అమ్మాయి ‘టీచర్' అని ఫిక్సయిపోతే...అంతకన్నా వెర్రితనం లేదు. ప్రెస్ నోట్ లో అంత క్లియర్ గా నేను రాసిన తర్వాత కూడా అర్థం చేసుకోలేనంత నిరక్షరాస్యత వాళ్లలో ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం సినిమా తీసాక, అందులో అభ్యంతరమైన సన్నివేశాలుంటే...ఆ వ్యవహారం చూడ్డానికి సెన్సార్ బోర్డ్ ఉంది. సెన్సార్ బోర్డ్ ను అధిగమించి...వీళ్లే నిర్ణయాలు తీసుకొంటామంటే..ఇక సెన్సార్ బోర్డ్ ఎందుకు?

  ఇక మరికొందరు...‘సావిత్రి' పేరును టైటిల్ గా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తపరిచారు. ఎందుకంటే...పురాణాల్లో సావిత్రి పతివ్రత కాబట్టి అని చెప్పారు. అలా అయితే మిగతా పేర్లు గల మహిళలెవరూ పతివ్రతలు కాదని వాల్లు చెప్పకనే చెప్పడం సభ్య సమాజానికి సిగ్గు చేటు. స్టేట్ కమీషన్ వాళ్లు నాకు పంపించిన నోటీస్ ప్రకారం...‘ఆ అమ్మాయి' టీచర్ అని వాళ్లకి వాళ్లే డిసైడ్ చేసుకున్నారు. విషయం ఏమిటంటే...సినిమా పాయింట్ ను చెప్పడానికి...‘నా టీనేజ్ లో నేను మొదటి ఆకర్షణకి లోనైన మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతి మేడమ్ ని ఉదహరించడం జరిగింది. అంతే కానీ, పోస్టర్‌లో చూపించిన లేడీ..టీచర్ కాదు. ఆ కథ నాది కాదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా కథ..టీచర్-స్టూడింట్ మధ్య జరిగే కథ ఎంత మాత్రం కాదు!

  ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం...ఒక అబ్బాయి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ఆధునిక జీవనశైలి వలన ఏ విధంగా ప్రభావితమయ్యాడు? దాని వలన, ఆ అబ్బాయితో పాటు... అతని చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి దుష్ర్పరిణామాలకు లోనయ్యారనేది చెప్పడం. ఇది తెలుసుకోకుండా కొంత మంది బాధ్యతారాహిత్యంతో, సినిమాలో లేని విషయాలను ఉన్నట్లుగా తమకుతాముగా ఊహించేసుకుని...టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

  ఇంకా నిజాలు తెలియకుండా నాకు నిందాపూర్వక నోటీస్ పంపిన స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారికి పూర్తి వివరణ ఇస్తాను. సినిమా పోస్టర్ లో కనిపిస్తున్న అబ్బాయి నటుడు. ఇంతకు ముందు కూడా అతను సినిమాల్లో నటించాడు. నా సినిమాలో కూడ అతను తన తల్లిదండ్రుల అనుమతితో మరియు, వారి సమక్షంలో నటిస్తున్నాడు.

  సినిమా ఏమిటో, దాని కథ ఏమిటో తెలుసుకోకుండా...ఎంతో డబ్బుతో, మరింకెంతో శ్రమతో మేము తీసే సినిమాకి...‘చీఫ్ పబ్లిసిటీ' కోసం మాకు నెగెటివ్ పబ్లిసిటీ ఇచ్చిన వారందరిపై కేసులు పెట్టబోతున్నాను. నాకు నోటీసులు పంపిన ‘స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్' ఆర్గనైజేషన్ కి కూడా నా సమాధానం ఇవ్వబోతున్నాను

  --------ఇట్లు/ రామ్ గోపాల్ వర్మ.

  English summary
  Film director Ram Gopal Varma is at it again. In an apparent bid to capture eyeballs for his latest Telugu flick ‘Savithri’, the film maker released posters revealing the first look of the film, which raised hackles of women in general, women organisations and social and civil rights’ activists alike.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X