»   » ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా పృధ్వి, బెంగాల్ టైగర్ పోస్టర్

ఫ్యూచర్ స్టార్ సిద్ధప్పగా పృధ్వి, బెంగాల్ టైగర్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణవంశీ ఖడ్గం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ పృథ్వి. ఆసినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో పాపులర్ అయిన పృథ్వి...తర్వా వివిధ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ దూసుకెలుతున్నారు. ఆ మద్య లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ ఆయన పాత్ర నవ్వులు పూయించింది.

ఈ మధ్య ఏ తెలుగు సినిమా చూసినా పృథ్వికి తప్పకుండా ఒక మంచి కామెడీ పాత్ర లభిస్తోంది. మొన్న విడుదలైన ‘శంకరాభరణం' సినిమాలో కూడా పృథ్వి అదరగొట్టాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘బెంగాల్ టైగర్' చిత్రంలో ఫ్యూచర్‌స్టార్‌ సిద్ధప్పగా నవ్వుల బాంబులు పేల్చబోతున్నాడు.

Prudhvi as Future star Siddappa in Bengal Tiger

అతని పాత్ర పేరుతో బెంగాల్ టైగర్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారంటే సినిమాలో అతని కామెడీకి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు అమల పాల్ పాత్రలో బ్రహ్మానందం కూడా ప్రేక్షకులను ఓ రేంజిలో ఎంటర్టెన్ చేయబోతున్నాడు. రవితేజ, తమన్నా, రాశి ఖన్నా ముఖ్య తారాగణంగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెంగాల్ టైగర్' చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు.

బెంగాల్ టైగర్ లో ఇంకా బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, రావు రమేష్, షాయాజీ షిండే, నాజర్, పోసాని కృష్ణ మురళీ, తనికెళ్ల భరణి, హర్షవర్ధన్ రానె, సురేఖా వాణి, అక్ష, శ్యామల, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ తదతరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సంగీతం: బీమ్స్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంపత్ నంది.

English summary
"In Bengal Tiger, I play an aspiring actor and my title is ‘Future star Siddappa’. It’s going to be hilarious," says Prudhvi.
Please Wait while comments are loading...