twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏం తెలివిరా బాబూ!!: ఫేస్ బుక్ పోస్ట్ డిలేట్ చేసి, నేను అనలేదంటూ మీడియాపై షాక్ ఇచ్చిన ఫృధ్వి

    చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన ఫృధ్వీ ఇప్పుడు రివర్స్ అయ్యారు.

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్ర విషయమై కమెడీయన్ పృధ్వీ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా పోస్ట్ ని డిలేట్ చేసి ,మీడియాతో మాట్లాడుతూ..అదంతా వెబ్ సైట్స్ వారు పుట్టించిన రూమర్ అన్నట్లుగా , తన మాటలు వక్రీకరించారని తేల్చాడు. ఎవరినుంచి ఏ ప్రెజర్ వచ్చిందో కానీ ఫృధ్వీ చేసిన ఈ పనికి వెబ్ మీడియా అంతా షాకైంది. తనను తొలి నుంచీ సపోర్ట్ చేస్తూ వస్తన్న మీడియా వారినే ఆయన తప్పు పట్టడం అందరిలో ఆశ్చర్యం కలగచేసింది.

    ''చాలా బాధగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంలో నటించడం నా అదృష్టం. సీన్స్ రిమూవ్ చేయడం నా దురదృష్టం. పండగ పూట మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది'' అని ఫేస్ బుక్ లో షేర్ చేసాడు పృధ్వీ.

    Prudhvi deleted Facebook post

    ఆ వార్తను వెబ్ మీడియా అంతా ముందుకు తీసుకువెళ్లింది. అయితే తన పాత్రను తగ్గించారన్నది అవాస్తమని ఫృధ్వీ అన్నారు. ఖైదీ నం.150లో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని పృధ్వీ తెలిపారు. కొన్ని వెబ్‌ సైట్లు తాను చెప్పిన మాటలను వక్రీకరించాయని, చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాగా పృధ్వీ నటించిన కొన్ని సీన్లు ఎడిటింగ్‌ లో కత్తెర పడినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

    దీనిపై పృధ్వీ తాను నటించిన సీన్లు తొలగించడం దురదృష్టకరమని, సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు ...తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ఖైదీ నం.150 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Comedian Prudhvi deleted his latest Face Book post. Today.. he posted that he was deeply disappointed by the removal of his scenes from megastar Chiranjeevi's comeback movie 'Khaidi No 150'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X