ఛాన్స్ ఇవ్వం అని బెదిరిస్తున్నారు.. ఆ నటులకు ఓట్లేయొద్దు: పృథ్వీ సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన విషయం తెలిసిందే. వారిలో ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ ఒకరు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన హాస్యనటుడు పృథ్వీరాజ్.. రాజకీయాల్లోనూ తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. వైసీపీలో చేరిన తర్వాత ఆయన తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ప్రత్యర్థులపై తరచూ విమర్శలు చేస్తున్న ఈ కమెడియన్.. సినీ ఇండస్ట్రీలోని పెద్దలపైనా కామెంట్లు చేస్తున్నారు.

ఎన్నికల తర్వాత తొలిసారి

ఎన్నికల తర్వాత తొలిసారి

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పృథ్వీ రాజ్ తెలుగు సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జ‌గ‌న్ గెలిచిన త‌ర్వాత కూడా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్కరు కూడా వ‌చ్చి త‌మ నాయ‌కుడికి అభినంద‌న‌లు తెలియ‌జేయ‌లేద‌ని, అంటే ఆయ‌న గెలిచినా కూడా ఎవ‌రికీ ప‌ట్ట‌దా అని పృథ్వీ ప్రశ్నించారు. 151 సీట్లు గెలిపించిన నాయకుడికి క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం లేదని అన్నారు.

పృథ్వీపై విమర్శలు

పృథ్వీపై విమర్శలు

పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది సినీ, రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. ‘నీ స్వ‌లాభం కోసం ఇండ‌స్ట్రీని ఎందుకు మ‌ధ్య‌లోకి తీసుకొస్తున్నావ్' అంటూ కొందరు సినీ ప్రముఖులు ఆయనతో అన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇక, రాజకీయ నాయకుల విషయానికొస్తే.. ఎలాగోలా ముఖ్య‌మంత్రి దృష్టిలో ప‌డి ఏదో ఓ ప‌ద‌వి తీసుకోడానికే ఇలా పృథ్వీ నానా మాట‌లు మాట్లాడుతున్నాడంటూ కొంద‌రు ఈయ‌న‌పై బాహాటంగానే దుమ్మెత్తిపోశారు.

జగన్ గెలవడం ఇష్టం లేదు

జగన్ గెలవడం ఇష్టం లేదు

ఇప్పటి వరకు జగన్‌ను ఏ సినీ ప్రముఖులు కలవకపోవడాన్ని గుర్తు చేస్తూ పృథ్వీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సినీ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదు. వాళ్లెవ్వరూ ఏపీ సీఎంను పట్టించుకోవట్లేదు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తికి జగన్ గెలుపు గురించి కూడా తెలియదట. ఆయన ఎంతో వెటకారంగా మాట్లాడారు'' అని పృథ్వీ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు గెలిచుంటే వాలిపోయేవారు

చంద్రబాబు గెలిచుంటే వాలిపోయేవారు

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించేవారని పృథ్వీ అన్నారు. అంతేకాదు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతి రోజే వాళ్లంతా అమరావతిలో వాలిపోయేవారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు సన్మానాలు గట్రా చేసేవాళ్లని చెప్పారు.

సినిమా వాళ్లకు ఓట్లేయొద్దు

సినిమా వాళ్లకు ఓట్లేయొద్దు

ఏపీ సీఎంను అభినందించడానికి సినీ పెద్దలెవరూ రాకపోవడంపై పృథ్వీ మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు సినిమా వాళ్లకు ఓట్లు వేయద్దని ఈ సందర్భంగా పృథ్వీ పిలుపునిచ్చాడు. అమరావతి గడ్డపై ఇంకో 30 ఏళ్లు వైసీపీ జెండానే ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

అవకాశాలు ఇవ్వొద్దంటున్నారు

అవకాశాలు ఇవ్వొద్దంటున్నారు

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లందరికీ అవకాశాలు ఇవ్వొద్దని ఇండస్ట్రీలో చెబుతున్నారు. ఎవరో ఛాన్సులు ఇస్తారని నమ్మి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. స్వశక్తి, టాలెంట్ ఉంది కాబట్టే ఇన్ని రోజులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. కొన్ని సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. అందుకే పృథ్వీ అంటే అందరికీ తెలిసిపోయింది. నన్ను తీసుకుంటే చేస్తా.. లేదంటే వాళ్ల కర్మ' అని పృథ్వీ వివరించారు.

 28న బాధ్యతల స్వీకరణ

28న బాధ్యతల స్వీకరణ

పృథ్వీ రాజ్‌ను శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ)కి చైర్మన్‌ను చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇందుకోసం ఆయన ఈనెల 28న ఆయన ఆ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తన పేరును ప్రజలందరూ గుర్తుంచుకునేలా పని చేస్తానని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X