గెస్ట్‌హౌస్‌ల్లో ఆ లింకులు సినిమా ఇండస్ట్రీకి అనవసరం, శ్రీరెడ్డి ఇష్యూపై పృధ్వి

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Comedian Prudhvi Sensational Comments On Bigg Boss

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ లేవనెత్తి పలువురు స్టార్లపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో మకాం వేసి తమిళ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్, లారెన్స్ లాంటి వారితో పాటు పలువురు తనను వాడుకున్నారని, ఈ విషయాలు బయట పెడుతున్న తనను విశాల్ బెదిరిస్తున్నాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రముఖ కమెడియన్ పృధ్వి ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.

వారు అలాంటి వారు కాదు

వారు అలాంటి వారు కాదు

లారెన్స్ మాస్టర్ చాలా కష్టపడి పైకిచ్చాడు. శ్రీరామ్ చాలా మంచి వ్యక్తి. మేము లాస్‌వెగాస్ లైవ్ షూటింగ్ వెళ్లినపుడు ఆయనే వంట కూడా చేసి పెట్టాడు. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయనకు ఫ్యామిలీ ఉంది. లారెన్స్ రాఘవేంద్ర స్వామికి దండం పెట్టుకుని బయల్దేరుతారు. ఏదో పొల్యూటెడ్‌లా అందరి గురించి అలా మాట్లాడటం సరికాదు. ఇటీవల శ్రీరెడ్డి తమిళంలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. ఆమె ఎదురుగా కూర్చున్న యాంకర్ కూడా ఆమె చెప్పే మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక అటూ ఇటూ చూశాడు..... అని పృధ్వి వెల్లడించారు.

తమ్మారెడ్డి సెక్స్‌రాకెట్ వీడియోపై

తమ్మారెడ్డి సెక్స్‌రాకెట్ వీడియోపై

ఈ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసిన ఓ వీడియోలో సెక్స్ రాకెట్ అని టైటిల్ పెట్టారు. అమెరికా వెళుతున్నారు, అమ్మాయిలను బలవంతంగా ఆ రాకెట్లోకి లాగేస్తున్నారు హోటల్‌లోకి అన్నట్లు మాట్లాడారు. పృధ్వీ రాజ్ అనేవాడిని ఉదాహరణకు తీసుకుంటే... మందు తాగని వ్యక్తి, చికాగో ఈవెంటుకు వెళ్లాడు. నోట్లో బలవంతంగా పెట్టిపోసేయరు కదా. అమ్మాయిలను చేయి పట్టి లాగితే అక్కడ ఎంబసీలు ఉన్నాయి. పోలీస్ సెక్యూరిటీ ఉంది, మనకంటే ఫాస్ట్ గా స్పందిస్తారు. మన అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయించేంత నీచమైన స్థితిలో ఉన్నారని నేను అనుకోవడం లేదని... పృధ్వీ రాజ్ అభిప్రాయ పడ్డారు.

పనంతా ఆపుకుని చేయడం కాదు

పనంతా ఆపుకుని చేయడం కాదు

ఒప్పుకోక పోయినా లాగేస్తున్నారు అనడం సరికాదు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అమెరికాలో తెలుగువారు షూటింగులకు మనకు ఇళ్లు ఇస్తున్నారు. భోజనం పెడుతున్నారు. వారి పని పక్కనపెట్టి మనల్ని షాపింగులకు తీసుకెళుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో డ్రాప్ చేస్తున్నారు. ఆయన ఎందుకు అలా అన్నాడో తెలియదు. ఇలా తలా ఒక మాట మాట్లాడుతున్నారు... అని పృధ్వీ రాజ్ అన్నారు.

పెద్ద మనిషితనం తీసుకోవాలి

పెద్ద మనిషితనం తీసుకోవాలి

ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలకు పరిష్కారం రావాలంటే... ఎవరైనా ఒకరు ముందుకొచ్చి పెద్దమనిషితనం తీసుకోవాలి. మీ సమస్యలేమైనా ఉంటే మాకు చెప్పండి పరిష్కరిస్తామనే బాధ్యత తీసుకోవాలి. ఎవరిక వారు మాట్లాడకుండా సైలెంటుగా ఉంటూ... వాడికి ఇది జరిగింది అని సంకలు గుద్దుకోవడం తప్పు.

అంత వరకు ఓకే...

అంత వరకు ఓకే...

ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్లి ఫోటోలు ఇచ్చేవారం. తర్వాత సీడీలు. తర్వాత వారి ముందుకెళ్లి పెర్ఫార్మెన్స్ చేయడం.... ఆ తర్వాత నా లింక్ ఉంది చూడండి అని యూట్యూబ్ లింకులు చూపించడం అక్కడి వరకు ఒకే.

గెస్ట్‌హౌస్ లింకులతో సంబంధం లేదు

గెస్ట్‌హౌస్ లింకులతో సంబంధం లేదు

నా లింక్ చూడండి అన్న తర్వాత... రాత్రి 8 గంటలకు హలో ఎక్కడ ఉంటారండీ మీరు? అంటే పలానా గెస్ట్ హౌస్‌లో ఉంటాం... అక్కడికి రండి అంటారు. అక్కడి లింకులు వేరే, ఆవి సినిమా పరిశ్రమకు అనవసరం. నువ్వు ఎవడితో పోతున్నావు? నీకు వాడికి మధ్య కనెక్షన్ ఏమిటో మాకు తెలియదు, అవసరం లేదు కూడా. వాటిని సినిమా ఇండస్ట్రీకి లింకు పెట్టి మాట్లాడటం సరికాదు పృధ్వి అభిప్రాయ పడ్డారు.

ఇండస్ట్రీలో గౌరవం ఎలా ఉటుందంటే...

ఇండస్ట్రీలో గౌరవం ఎలా ఉటుందంటే...

సినిమా ఇండస్ట్రీలో గౌరవం ఎలా ఉంటుందంటే... కెమెరా ముందు ఎలా ఉన్నాడు? సెట్స్‌లో ఎలా ప్రవర్తిస్తున్నాడు? తోటి నటీనటులతో ఎలా మసులుకుంటున్నాడు ఇదే చూడాలి. అంతే కానీ కాఫీ షాపులో కూర్చున్నారు, ముద్దులెట్టుకున్నారు, ఒకే చాక్లెట్ నోట్లో పెట్టుకున్నపుడు ఫోటోలు... అవన్నీ ఎందుకు? అంటూ పృధ్వి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X