ఆత్మహత్యే మార్గం అనుకున్నా.. ఆ టైమ్‌లో చిరంజీవి.. పృథ్వీ సంచలన కామెంట్స్

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించిన ఆయన.. తాను ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అండగా నిలిచారని చెప్పారు పృథ్వీ. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి పోతే..

Recommended Video

Prudhvi Raj Emotional Comments On Megastar Chiranjeevi
ఎస్వీబీసీ పదవికి రాజీనామా.. ఆ తర్వాత

ఎస్వీబీసీ పదవికి రాజీనామా.. ఆ తర్వాత

ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కొన్ని రోజులు శైలిని అయిన పృథ్వీ.. గత రెండు మూడు రోజులుగా ఆ వివాదంపై, తనపై జరిగిన కుట్రపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 30 ఇయర్స్ పృథ్వీ సంచలన విషయాలు వెల్లడించారు.

అన్యాయంగా ఇరికించారు

అన్యాయంగా ఇరికించారు

ఇంటర్వ్యూలో భాగంగా తన సినీ, రాజకీయ విషయాలు ప్రస్తావించిన పృథ్వీ.. ఎస్వీబీసీ వ్యవహారంలో తన తప్పేమీ లేకున్నా తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. పోకిరి సినిమాలో ఎలాగైతే రౌడీలు ఇలియానా బట్టలు చింపేసి ఇక నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారో.. అలాగే తనపై కూడా అభాండం వేసి వదిలేశారని అన్నాడు.

ఇరికించిన వారంతా అవుట్.. నాశనమైపోతారు

ఇరికించిన వారంతా అవుట్.. నాశనమైపోతారు

ఈ వ్యవహారంలో తనను ఇరికించిన వారిని ఆ వేంకటేశ్వరస్వామే శిక్షిస్తారని చెప్పారు. అంతేకాదు తనపై కుట్ర మొత్తం సొంత పార్టీ వారే చేశారని సంచలన ఆరోపణలు చేశారు పృథ్వీ. తనను ఇబ్బంది పెట్టిన వారిలో కొందరు ఇప్పుడు బతికి లేరని, మిగిలిన వాళ్ళు కూడా నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. అయినా పార్టీని మాత్రం వదలివెళ్లానని పృథ్వీ స్పష్టం చేశారు.

ఆ ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత.. చిరంజీవి మాత్రమే!

ఆ ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత.. చిరంజీవి మాత్రమే!

ఆ మధ్య ఆడియో టేప్ బయటికి వచ్చిన తర్వాత తన కెరీర్ పూర్తిగా డల్ అయిపోయిందని, అప్పటినుంచి కనీసం ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని అన్నారు పృథ్వీ. తన చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఓ సమయంలో ఆత్మహత్యే మార్గం అనుకున్నానని.. అప్పుడు తనకు అండగా నిలిచింది చిరంజీవి మాత్రమే అని చెప్పారు పృథ్వీ.

గ్రేట్ చిరంజీవి.. అంత గొప్పోడు!!

గ్రేట్ చిరంజీవి.. అంత గొప్పోడు!!

చిరంజీవి అంత గొప్పవాడు సినీ ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పాడు పృథ్వీ. మిగిలిన సంగతెలా ఉన్నా.. తన దృష్టిలో మాత్రం చిరంజీవే గొప్పోడు అని అన్నారు. ఇటీవలే చిరంజీవి సైరా సినిమాలోనూ పృథ్వీ నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫంక్షన్ లోనే తనకు మెగా ఫ్యామిలీతో ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

గతంలో పృథ్వీ కామెంట్స్.. వైఎస్ జ‌గ‌న్ గెలిచినా సినీ ఇండస్ట్రీ!!

గతంలో పృథ్వీ కామెంట్స్.. వైఎస్ జ‌గ‌న్ గెలిచినా సినీ ఇండస్ట్రీ!!

ఇకపోతే గత కొంతకాలంగా కాంట్ర‌వ‌ర్సీల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న పృథ్వీ.. ఎన్నికల సమయంలోనే బండ్ల గ‌ణేష్‌, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లపై కూడా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ గెలిచినా కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ‌రూ వ‌చ్చి విష్ చేయ‌డం లేదంటూ అంద‌రిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు పృథ్వీ. మళ్ళీ ఇప్పుడు చిరంజీవిపై ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X