రాజేంద్ర ప్రసాద్‌‌పై పృథ్వీ కామెంట్స్.. జగన్ జోలికొస్తే తాట తీస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు

Recommended Video

Prudhvi Raj Shocking Comments On Rajendra Prasad || Filmibeat Telugu

ఇటీవలే తిరుపతితో రాజేంద్ర ప్రసాద్‌‌ మాట్లాడిన మాటలపై పరోక్షంగా చురకలంటించారు నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ సినీ పరిశ్రమలో ఫేమస్ అయిన ఆయన గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే తన నోటికి పని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పృథ్వీ తాజాగా మరోసారి విరుచుకుపడ్డాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ పృథ్వీ చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకిపోతే..

151 సీట్లు గెలిచిన నాయకున్ని పట్టించుకోవడం లేదు

151 సీట్లు గెలిచిన నాయకున్ని పట్టించుకోవడం లేదు

వైఎస్ జ‌గ‌న్ గెలిచిన త‌ర్వాత కూడా సినీ ఇండ‌స్ట్రీ నుంచి ఒక్కరు కూడా వ‌చ్చి త‌మ నాయ‌కుడికి అభినంద‌న‌లు తెలియ‌జేయ‌లేద‌ని, అంటే ఆయ‌న గెలిచినా కూడా ఎవ‌రికీ ప‌ట్ట‌దా? అంటూ గతంలో పృథ్వీ తెలుగు సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 151 సీట్లు గెలిపించిన నాయకుడికి సినీ ఇండస్ట్రీ వాళ్ళు క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం లేదని ఆ సమయంలో పృథ్వీ అన్నాడు.

తిరుపతిలో రాజేంద్ర ప్రసాద్ కౌంటర్

తిరుపతిలో రాజేంద్ర ప్రసాద్ కౌంటర్

తెలుగు సినీ పరిశ్రమపై పృథ్వీ చేసిన కామెంట్స్ పై ఇటీవలే తిరుపతిలో కౌంటర్లు వేశాడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. సీఎం కాగానే వెంటనే కలవడానికి సినీ నటులు వ్యాపారవేత్తలు కాదని రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. సినిమా వాళ్ళు సీఎంను కలిసి అభినందించాలనే నిబంధన ఏమీ లేదని ఆయన పేర్కొన్నాడు.

ఇండిపెండెన్స్ డే.. పృథ్వీ మీటింగ్

ఇండిపెండెన్స్ డే.. పృథ్వీ మీటింగ్

నిన్న (ఆగస్టు 15) ఇండిపెండెన్స్ డే సందర్బంగా తిరుపతిలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు పృథ్వీ. ఈ సందర్బంగా ఇటీవల వైఎస్ జగన్ పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు విలేకరులు. దీంతో వెంటనే రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై పృథ్వీ మండిపడ్డాడు. పరోక్షంగా ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ఫైర్ అయ్యాడు.

వర్గ విభేదాలకు దారి తీసేలా రాజేంద్ర ప్రసాద్ మాటలు

వర్గ విభేదాలకు దారి తీసేలా రాజేంద్ర ప్రసాద్ మాటలు

రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత టాలీవుడ్ ప్రతినిధులుగా ఆయనకు శుభాకాంక్షలు తెలపడం కనీస ధర్మం అని అన్నారు పృథ్వీ. గతంలో ఇదే విషయాన్ని తాను ప్రస్తావించానని, తన మాటల్లో తప్పేమీ లేదని చెప్పారు. తిరుమలలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమను రెండుగా చీల్చేలా ఉన్నాయని, వర్గ విభేదాలకు దారి తీసేలా వ్యవహరించారని
పృథ్వీ విమర్శించారు.

తాట తీస్తానంటూ పృథ్వీ..

తాట తీస్తానంటూ పృథ్వీ..

గతేడాది నవంబర్ లో తెలంగాణకు జరిగిన ఎన్నికల అనంతరం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని పృథ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని వైఎస్ జగన్ విషయంలో ఎందుకు అనుసరించట్లేదని ప్రశ్నించారు. అకారణంగా, అనవసరంగా వైఎస్ జగన్ జోలికి వచ్చినా, ఆయనను విమర్శించినా తాను ఎంత మాత్రం ఉపేక్షించబోనని, వారి తాట తీస్తానని పృథ్వీ హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X