లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒక బాహుబలి.. చంద్రబాబుని ఎగతాళి చేసిన కమెడియన్ పృథ్వి!

Recommended Video

Prudhvi Raj Speech At Lakshmi's NTR Trailer Launch Event | Filmibeat Telugu

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఎపిసోడ్ ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నాడు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి ట్రైలర్ జనాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ఆసక్తిని పెంచింది. తాజాగా వర్మ రెండవ ట్రైలర్ ని కూడా విడుదల చేశాడు. శుక్రవారం రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సింహగర్జన పేరుతో హైదరాబాద్ లో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు లక్ష్మి పార్వతి, కమెడియన్ పృథ్వి. నటుడు పోసాని లాంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.

 వెధవలు ఇదే నా సమాధానం

వెధవలు ఇదే నా సమాధానం

కమెడియన్ పృథ్వి మాట్లాడుతూ.. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎదురుగా మాట్లాడడం నా డ్రీమ్ అని పృథ్వి అన్నారు. పృథ్వి వైసిపికి చెందిన మనిషి కాబట్టే లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలా మాట్లాడే వెధవలు ఇదే నా సమాధానం.. తప్పు జరిగింది కాబట్టే వర్మగారు ఈ చిత్రం తీశారు అని పృథ్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి వైసీపీకి సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు.

చంద్రబాబుని ఎగతాళి చేస్తూ

చంద్రబాబుని ఎగతాళి చేస్తూ

తన ప్రసంగంలో చంద్రబాబుని ఎగతాళి చేస్తో పృథ్వి కొన్ని కామెంట్స్ చేశారు. చంద్రబాబు స్టైల్ లో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మేము చక్రం తిప్పాం అని కొందరు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్. ఆయన కాంగ్రెస్ ని బంగాళా ఖాయంలో విసిరేయమంటే అందరూ అలాగే చేశారు. ఎన్టీఆర్ గొప్పతనం అది. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ మన సంస్కృతికి చిహ్నంగా నిలిచారు అని పృథ్వి ప్రశంసించారు.

 ఈ పేస్‌ని ఎవరు చూస్తారండీ

ఈ పేస్‌ని ఎవరు చూస్తారండీ

అసలు నిజాలే మాట్లాడని ఈ పేస్ ని ఎవరు చూస్తారండీ అంటూ చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వర్మగారు చూపించబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం అసలైన కథ. దానికి నేనే సాక్ష్యం. విద్యని పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాం ఇంచార్జీగా పనిచేశా. ఆ సమయంలో ప్రత్యక్షంగా వైస్రాయ్ సంఘటనని కవర్ చేశానని పృథ్వి తెలిపారు. అప్పట్లో సీడీలు లేవు కాబట్టి ఆ వీడియో ఫుటేజ్ దొరకడం కష్టంగా ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల లోపు ఆ వీడియోని ఎలాగైనా సంపాదిస్తా అని పృథ్వి అన్నారు.

బాహుబలి రేంజ్‌లో

బాహుబలి రేంజ్‌లో

వాస్తవాలతో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుందని పృథ్వి తెలిపాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో ఆర్జీవీ కంగారు పడాల్సిన అవసరమే లేదని పృథ్వి తెలిపారు. అసలైన ఎన్టీఆర్ బయోపిక్ అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రమే అని పృథ్వి వ్యాఖ్యానించాడు. ఈ చిత్రం గురించి మరిన్ని సంగతులు మునుముందు వివరిస్తానని పృథ్వి తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X