PSPKRana making Glimpse: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భీమ్లా నాయక్.. హై వోల్టేజ్ లుక్ మామూలుగా లేదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ మరోసారి అంచనాల డోస్ ను పెంచేసింది. మలయాళం సినిమాకు రీమేక్ అయినప్పటికీ తెలుగు జనాలకు మాత్రం ఇది మరో బాహుబలి అని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్‌ను విడుదల చేయడమే కాకుండా సినిమా విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు.

Recommended Video

PSPK Rana Movie : Bheemla Nayak Vs Mahesh Babu | Trivikram | Oneindia Telugu
బిమ్లా నాయక్ పవర్ఫుల్ లుక్

బిమ్లా నాయక్ పవర్ఫుల్ లుక్

గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ మరొక టాలెంటెడ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. బిమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్ స్టార్ లుక్ అయితే మామూలుగా లేదు. గబ్బర్ సింగ్ అనంతరం మళ్ళీ ఇలాంటి లుక్కులో కనిపించలేదు. అందుకే అభిమానులు ఈ సినిమాపై బాహుబలి లాంటి అంచనాలు పెంచేసుకుంటున్నారు.

మేకింగ్ గ్లింప్స్‌

మేకింగ్ గ్లింప్స్‌

ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్‌ ను విడుదల చేయగా అందులో పవర్ స్టార్ - రానా హై వోల్టేజ్ లుక్స్ తో దర్శనమిచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఇక దర్శకుడు సాగర్ కె చంద్ర అయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఎక్కువభాగం సెట్స్ లోనే ఉంటూ తనదైన శైలిలో ఐడియాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ మాటల వరకే కాకుండా..

త్రివిక్రమ్ మాటల వరకే కాకుండా..

త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. కేవలం మాటల వరకు మాత్రమే కాకుండా సీన్స్ విషయంలో కూడా దర్శకుడితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారట. పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా సినిమాలో బుల్లెట్స్ లా ఉంటాయని టాక్ నడుస్తోంది.

 రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవల షూటింగ్ విషయంలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. సీతారా ఎంటర్టైన్మెంట్స్ పై ప్రొడక్షన్ నెంబర్ 12గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఇక సినిమాని మొదట అక్టోబర్ లేదా నవంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కావడం లేదు. ఇక సంక్రాంతికి ఫిక్స్ చేశారు. బీమ్లా నాయక్ రిపోర్ట్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా వివరణ ఇచ్చారు. మరి ఆ టైమ్ లో సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X