పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడు.. కానీ మళ్లీ వెళ్లిపోతాడట..
పవన్ కళ్యాణ్ 25వ సినిమా ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరుగు ముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. పవన్ తదుపరి షెడ్యూల్ ఇలా ఉంది..

లండన్‌కు పవన్ కల్యాణ్
త్రివిక్రమ్ సినిమాకు పవన్ కాస్త బ్రేక్ ఇచ్చి ఇండియా, యురోపియా బిజినెస్ ఫోరం ప్రదానం చేయనున్న గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డును స్వీకరించేందుకు 17, 18 తేదీల్లో లండన్‌కు వెళ్లనున్నారు.

లండన్ నుంచి వచ్చిన..
లండన్ నుంచి తిరిగొచ్చాక పార్టీ పనుల్ని చక్కబెట్టుకుని అనంతరం సినిమా షూటింగ్లో పాల్గొంటారనేది తాజా సమాచారం. జనసేన పార్టీ కార్యక్రమాలను కూడా గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకొంటారట.

తదుపరి షెడ్యూల్ ప్లాన్
ఆ తర్వాత తన సినిమా తదుపరి షెడ్యూల్ ఖారారు కానున్నట్టు తెలుస్తున్నది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జనవరి 10న రిలీజ్
త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. జల్సా, అత్తారింటి ఘన విజయాల తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు పవన్, త్రివిక్రమ్ కాంబో సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











